స్కూటీ పాడైందని మహిళ ఫోన్.. వెంటనే పోలీసులు సాయం...

తన స్కూటీ పెట్రోల్ లేకుండా ఆగిపోయిందంటూ ఓ మహిళ ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు.

news18-telugu
Updated: November 29, 2019, 10:36 PM IST
స్కూటీ పాడైందని మహిళ ఫోన్.. వెంటనే పోలీసులు సాయం...
స్కూటీ నిలిచిపోవడంతో మహిళకు పోలీసుల సాయం
  • Share this:
తన స్కూటీ పెట్రోల్ లేకుండా ఆగిపోయిందంటూ ఓ మహిళ ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్ పరిధిలో ఓ మహిళ స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. దీంతో బాధితురాలు పోలీసుల సాయం కోసం 100 నెంబర్‌కు ఫోన్ చేసింది. పెట్రోల్ లేకపోవడంతో తన వాహనం ఆగిపోయిందని.. కొంచెం సాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. బ్లూకోట్స్‌కు చెందిన ఇద్దరు పోలీసులు ఓ బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని వెళ్లారు. ఆమె వాహనంలో పెట్రోల్ పోసిన తర్వాత మహిళను క్షేమంగా అక్కడి నుంచి పంపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 29, 2019, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading