Home /News /telangana /

HYDERABAD POLICE HAVE REGISTERED A VIRAL CASE OF DANCING VIDEOS OF A YOUNG WOMAN IN HYDERABAD METRO RAIL STATION SNR

Hyderabad | Video viral : మెట్రో రైల్‌లోనే రెచ్చిపోయింది.. హైదరాబాద్‌ అమ్మాయా.. మజాకా

hyd lady dance

hyd lady dance

Hyderabad: సోషల్ మీడియాలో ఏదో విధంగా పాపులర్ కావాలనే ప్రయత్నాలు యువతను చిక్కుల్లో పడేస్తున్నాయి. ఓ అందమైన యువతి హైదరాబాద్‌ మెట్రో రైల్, స్టేషన్‌లో డ్యాన్స్ చేసింది. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేసిందంటూ మెట్రో రైల్ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె వీడియోలే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
సోషల్ మీడియా(Social media)లో ట్రెండ్ కావడానికి ..ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్(Video viral) అవ్వాలనే కుతూహలంతో కొందరు యువతీ, యువకులు రోడ్లు, బస్టాండ్‌లు(Bus Stand), రైల్వేస్టేషన్‌(Railway Station)లు వంటి పబ్లిక్ ప్లేసుల్లో డ్యాన్సులు(Dance) చేస్తూ, ప్రాంక్ వీడియో(Prank video)లతో జనానికి పరమ చిరాకు తెప్పిస్తున్నారు. ఏదో రకంగా పాపులర్ కావాలని ట్రై చేస్తూ పరువు బజారుకు ఈడ్చుకుంటున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రోస్టేషన్‌ (Hyderabad Metro Station) , మెట్రో రైల్లో ఓ యువతి(Young woman)డ్యాన్స్ చేసిన వీడియోలపై కూడా పబ్లిక్ నుంచే కాదు మెట్రో అధికారుల నుంచి కూడా ఇలాంటి టాకే వినిపిస్తోంది.

పబ్లిక్ ప్లేసులో ఏంటీ న్యూసెన్స్..
హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్‌ వీడియోలు చూస్తుంటే నవ్విపోదురు కదా నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది. ఏ ప్రాంతానికి చెందిన యువతో తెలియదు కాని..మోడ్రన్‌ డ్రెస్‌లో రన్నింగ్‌లో ఉన్న మెట్రో రైల్‌లో డ్యాన్స్ చేసింది. మెరున్‌ కలర్ టాప్‌, చిరిగిన జీన్స్‌ వేసుకొని చూడటానికి బాగానే ఉన్న అమ్మాయి..మ్యుజిషియన్స్ కొట్టండమ్మా అని వస్తున్న వాయిస్‌కి అనుగూణంగా చేతులు ఊపుతూ డ్యాన్స్ చేసింది. మెట్రో ట్రైన్‌లో ఎవరి పనులపై వాళ్లు సీరియస్‌గా జర్నీ చేస్తుంటే ఓ అమ్మాయి ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూసి నోరువెళ్లబెట్టారు.

ఏం అమ్మాయిరా బాబోయ్..
అంతటితో ఆగలేదు అమ్మడి జోరు. ఈసారి మెట్రో రైల్వే స్టేషన్‌లోనే దుకాణం పెట్టింది. రా రా రక్కమ్మ అంటూ సాగే మాస్‌ సాంగ్‌కి బీట్‌కు తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ ప్రయాణికుల చూపులను తనవైపు తిప్పుకుంది. అమ్మాయి చేసిన డ్యాన్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతున్నాయి. ఆమె అప్‌ లోడ్ చేసిందో లేక వెరెవరైనా షేర్ చేశారో తెలియదు కాని..చివరకు అమ్మాయిపై కేసు నమోదైంది.

డ్యాన్స్‌ చేసినందుకు కేసు..
ప్రయాణికులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఈ వీడియోలు చేసిన యువతిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మెట్రో రైల్ అధికారులు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువతి ఎవరూ ..? ఎందుకిలా న్యూసెన్స్ చేసిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఈ అమ్మాయి  డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు కూడా కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు అమ్మాయి డ్యాన్స్‌లో పెద్దగా ఊపు లేదు కేసు నమోదు చేయాల్సిందేనంటూ కౌంటర్‌లు ఇస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Hyderabad Metro rail, Hyderabad police, Social Media, Viral Video

తదుపరి వార్తలు