Saidabad rape : సైదాబాద్ రాజు ఇక్కడే ఉన్నాడు.. పదిలక్షలు ఇస్తారా.. పోలీసులకు ఫేక్ కాల్స్.. ఎన్నంటే..?

Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు వారినే ముప్పు తిప్పలు పెట్టాయా.. రాజు ఇదిగో.. అదిగో అంటూ వారికే చుక్కలు చూపించారా... ? పోలీసులు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఎంతమంది ఫోన్ చేసి ఎం అడిగారు..?

Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు వారినే ముప్పు తిప్పలు పెట్టాయా.. రాజు ఇదిగో.. అదిగో అంటూ వారికే చుక్కలు చూపించారా... ? పోలీసులు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఎంతమంది ఫోన్ చేసి ఎం అడిగారు..?

  • Share this:
    రివార్డు తెచ్చిన తంట

    సైదాబాద్ అత్యాచార (saidabad rapist) నిందితుడు రాజు సంఘటన అనంతరం తప్పించుకుని తిరిగిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా అత్యాచారం(rape) సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో రాజకీయ పార్టీల నేతలు,(political parties) ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిందితున్ని పట్టుకునేందుకు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

    రాజును పట్టుకునేందుకు పది లక్షల రివార్డు 

    ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు(hyderabad police) రాజును పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. డీజీపీతో (dgp)పాటు సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేసి ఏకంగా రాజును ప్రట్టుకునేందుకు పది లక్షల రివార్డును(cash reward) ప్రకటించారు. ఇందుకోసం పోలీసులు రెండు కాంటాక్ట్ నెంబర్లను విడుదల చేశారు. ఆచూకి తెలసిన వారు ఆ నంబర్లకు ఫోన్ చేయాలని(phone numbers) చెప్పారు. ఈ క్రమంలోనే రాజు వివిధ రకాల ఫోటోలను సైతం విడుదల చేశారు.

    ఇది చదవండి : మరో మహిళా అధికారిపై పెట్రోల్ దాడి... కారణం ఇదే.. !


    పోలీసులకు ముప్పుతిప్పలు 

    అయితే పోలీసులు విడుదల చేసిన ఫోన్ నంబర్లపై అధికంగా ఫేక్ నంబర్లే(fake numbers) వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా రాజు (raju)మా వద్దే ఉన్నాడు. చెబితే పదిలక్షలు ఇస్తారా అంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా పోలీసులు ముందుగా వచ్చిన కాల్స్‌లో ఉరుకులు పరుగులు కూడా పెట్టనట్టు చర్చ జరగుతుంది.

     ఇది చదవండి : నగర నడిబొడ్డులో గంజాయి కేఫ్‌లు.. ఇన్‌‌స్టాలో వల..


    గంజాయి ఉందా... ? 

    ఇది ఇలా ఉంటే పోలీసులు ఇచ్చిన నంబర్లను నిందితుడి నంబర్లుగా భావించిన కొంతమంది ఫోన్ చేసి ఎవరు ఏంటి కనుక్కొవడం పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కూడా చేశారని తెలుస్తోంది. ఇక రాజుకు గంజాయి తాగే అలవాటు కూడా ఉండడంతో కొంతమంది ఫోన్ చేసి గంజాయి ఉందా అంటూ కూడా అడిగినట్టు తెలుస్తోంది.

     ఇది చదవండి : పెళ్లి చేసుకోనంటూ ఏకంగా సీఎంకు లేఖ రాసిన యువతి.. కారణం ఇదేనంటూ ఆవేదన...!


    పోలీసులకు 5000 కాల్స్..

    ఇలా పోలీసులకు ఆచూకి చెబుతామడనడంతో పాటు పలు రకాలుగా మొత్తం అయిదువేల వరకు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కాల్స్ అటెండ్ చేసిన పోలీసులు ముందుగా ఉరుకులు పెట్టినా... ఆ తర్వాత పక్కా సమాచారంతోనే విచారణ చేపట్టినట్టు చెబుతున్నారు. మొత్తం మీద మూడు రోజుల పాటు పోలీసులు విడుదల చేసిన ఫోన్ నంబర్లు వారినే ముప్పుతిప్పలు పెట్టినా... చివరకు రాజు ఎవరికి దొరకకుండా ఆత్మహత్య(suicide) చేసుకోవడం సంచలనంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published: