Chandanagar murder case : నేనే గోంతు కోసి హత్య చేశాను.. చందానగర్ హత్యకేసులో వీడిన మిస్టరీ..

Chandanagar murder case : నేనే గోంతు కోసి హత్య చేశాను..

Chandanagar murder case : హైదరాబాద్ లోని చందానగర్‌లో జరిగిన నర్సు నాగ చైతన్య సంఘటనలో తానే హత్య చేసినట్టు ప్రియుడు కోటిరెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడు. కత్తితో నాగచైతన్యను గొంతు కోసి హత్య చేసినట్టు అంగీకరించాడు.

  • Share this:
    రెండు రోజుల క్రితం నగరంలోని నల్లగండ్లలో ( Hyderabad ) జరిగిన నర్సు నాగచైతన్య ( Nagachitanya ) హత్య కేసులో చందానగర్‌ ( Chandanagar ) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు కోటిరెడ్డిని పోలీసులు ఒంగోలు ( Ongolu ) నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కత్తితో నాగచైతన్య గొంతు కోసి హత్య ( Murder ) చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కోటిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.

    కాగా ఈ ఘటన అనంతరం గాయాలతో ఉన్న నిందితుడు భయంతో హైదరాబాద్‌ నుండి ఒంగోలు పారిపోయి అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే...వివరాల్లోకి వెళితే..
    ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవదికి చెందిన నాగచైతన్య (24) హైదరాబాద్‌ నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తోంది. అయితే.. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటేటివ్‌ గా ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ క్రమంలోనే కోటిరెడ్డి విధుల్లో భాగంగా ఇద్దరికి ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనను ఆరు నెలల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ నాగచైతన్య.. కోటిరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో కోటిరెడ్డి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు.

    ఇది చదవండి : మరదలిని ప్రేమించినందుకు బెదిరించిన మేనత్త, మామ.. సెల్ఫీ వీడియోతో యువకుడు దారుణం


    దీంతో కోటిరెడ్డి ముందస్తు ప్లాన్‌గా ఆమెను హతమర్చితే తప్ప సమస్య నుండి బయటపడే అవకాశాలు లేవని భావించాడు. దీంతో పక్కా స్కెచ్‌తో హైదరాబాద్‌ చేరుకున్నాడు.. ఈ క్రమంలోనే ఈ నెల 23న నల్లగండ్లలోని ఓ హోటల్‌లో ఇద్దరు కలిసి గది అద్దెకు తీసుకున్నారు. కాగా ఆదివారం రాత్రి వరకు తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తెరిచారు. నాగచైతన్య రక్తపు మడుగులో పడి కనిపించింది... దీంతో పోలీసులకు సమచారం అందించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రియుడు కోటిరెడ్డి ఆమెను హత్య చేసి పారిపోయినట్టు పోలీసులు అప్పుడే అనుమానించారు. ముందుగా ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారని నమ్మించిన కోటిరెడ్డి సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం కోటిరెడ్డి కోసం రంగంలోకి దిగిన పోలీసులు ఒంగోలు వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం విచారణ కోసం హైదరాబాద్ తీసుకువచ్చి విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు.

    ఇది చదవండి : గుట్కా కోసం ఫైటింగ్... కత్తులతో వీరవిహరం... !

    Published by:yveerash yveerash
    First published: