Home /News /telangana /

Hyderabad : కేబీఆర్ పార్క్‌ దాడి కేసులో నిందితుడి అరెస్ట్.. సినీ పరిశ్రమలో లైట్‌బాయ్

Hyderabad : కేబీఆర్ పార్క్‌ దాడి కేసులో నిందితుడి అరెస్ట్.. సినీ పరిశ్రమలో లైట్‌బాయ్

Shalu Chourasia

Shalu Chourasia

Hyderabad : హైదరాబాద్​లోని నటి షాలూ చౌరాసియాపై దాడి కేసును పోలీసులు చేధించారు. హిరోయిన్ పై దాడి చేసిన నిందితున్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

    గత వారం రోజుల క్రితం హైదరాబాద్ కేబీర్ పార్క్ వద్ద హిరోయిన్ షాలూ చౌరాసియాపై దాడి చేసి సెల్‌ఫోన్ సైతం ఎత్తుకుపోయిన నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కమిషనర్ అంజన్‌కుమార్ దాడికి సంబంధించి విషయాలను వివరించారు. చౌరాసియాపై దాడి (Attack on Shalu Chourasia) కేసులో నిందితుడిని టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దాడి చేసిన (Attack on Shalu Chourasiya) వ్యక్తి సినీ పరిశ్రమలో లైట్ బాయ్‌గా పనిచేస్తున్న బాబుగా గుర్తించారు. దాడిలో చౌరాసియా గాయపడడంతో పాటు వివీఐపిలు సంచరించే ప్రాంతంలో సంఘటన జరగడంతో ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. దాడి అనంతరం నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు గుర్తించారు.

    సంఘటన జరిగిన తర్వాత అనేక కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు చాలా మందిని విచిరించినట్టు చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. దీంతో అసలు నిందితున్ని పట్టుకోగలిగామని చెప్పారు. కాగా దాడి చేసిన నిందితుడి పేరు బాబుగా గుర్తించారు. బాబుపై గతంలోనే విజయవాడ, గోల్కోండతోపాటు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసులు ఉన్నాయని వివరించారు. గోల్కోండలో నమోదైన కేసులో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చినట్టు సీపీ తెలిపారు. ఇక బాబును అదుపులోకి తీసుకున్న అనంతరం నిందితుడు కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నట్టు గుర్తించి, ఇంటికి వెళ్లి సెర్చ్ చేశారు. ఇంట్లో ఉన్న నటి మొబైల్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు.. నిందితుడు గతంలో ఇతర పనులు చేస్తూ గత కొద్ది రోజులుగా సినిపరిశ్రలో లైన్ బాయ్ గా పని చేస్తున్నట్టు చెప్పారు. దాడి అనంతరం నేరుగా కృష్ణా‌నగరలోని ఇంటికి చేరుకున్నట్టు చెప్పారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడు తన పద్దతి మార్చుకోలేదని చెప్పారు. అయితే దాడి జరిగిన తర్వాత ఏ కెమెరాల్లో కూడా నిందితుడు కాప్చర్ కాలేదని సీపీీ వివరించారు. దీంతో దొంగతనాలు చేసే వారిపై దృష్టి సారించి.. వారిలో జైలులో ఉన్న వారిని వదిలేసి బయట తిరుగుతున్న వారిని విచారించామని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో టెక్నాలజీని కాకుండా ఎక్కువమందిని విచారించామని చెప్పారు. ఇందుకోసం 50 మంది సిబ్బంది 5 రోజులల పాటు విచారణ జరిపారని  చెప్పారు.

    ఇది చదవండి : ఆస్తికోసం భర్తను , భార్య ఏం చేసిందంటే.. ?

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Hyderabad police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు