Home /News /telangana /

HYDERABAD POLICE HAS HOUSE ARRESTED THE TPCC CHIEF REVANTH REDDY IN THE WAKE OF CONGRESS CALL FOR THE ELECTRICITY OFFICES PROTEST IN HYDERABAD PRV

Revanth reddy Arrest: టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అరెస్ట్​.. ఆ ప్రాంతంలో నిరసనలకు వెళ్లకుండా పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

    తెలంగాణలో పెంచిన విద్యుత్ ఛార్జీల (Electricity Charges) పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్​ (Congress) పార్టీ నేతలు గురువారం విద్యుత్‌ సౌధ, సివిల్‌ సప్లై కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని (Hyderabad) నెక్లె స్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి వఇద్యుత్ సౌధ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్​ సౌధ (Electricity) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సౌధ ముట్టడిని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ నేతలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోనున్నారు.

    కాంగ్రెస్​ నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ (Revanth reddy House Arrest) చేశారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కను సైతం పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు.

    రూ 6,831 కోట్ల ఆదాయం..

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచారు.ఈ నెల 1వ తేదీ నుండి పెంచిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. డిస్కం కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదించాయి. విద్యుత్ ఛార్జీలను (Electricity Charges) 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్‌ విద్యుత్ యూనిట్పై 40 నుంచి 50 పైసలు పెంచారు. ఇక ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెంచారు. ఛార్జీలను 19 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఈఆర్సీకి (ERC) డిస్కంలు(Discoms) విజ్ఞప్తి చేశాయి. అయితే ఛార్జీలను 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అంగీకరించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇచ్చాయి. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ 6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ భారమంతా ప్రజలపైనే పడనుంది.

    ప్రస్తుతం  రాష్ట్రంలో అనేక వర్గాలకు విద్యుత్ సబ్సిడీ అందుతోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఇక రైతులకు అందించే ఉచిత విద్యుత్‌లో భాగంగా 25 లక్షల పంపుసెట్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తుండటంతో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు 2 రూపాయల సబ్సిడీ ఉంది. అయితే రైల్వే చార్జీలు, బొగ్గు, రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంచక తప్పలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

    కొద్దిరోజుల క్రితం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో టిఎస్‌ఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి పాల్గొని డిస్కంల నష్టాల గురించి వివరించారు. గృహ అవసరాలకు కూడా కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని చార్జీల పెంపును ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించే ముందు ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: ELectricity, Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు