హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh visarjan: నేడే వినాయక నిమజ్జనం...భక్తులెవరూ రావద్దని నిర్వాహకుల విజ్ఞప్తి

Ganesh visarjan: నేడే వినాయక నిమజ్జనం...భక్తులెవరూ రావద్దని నిర్వాహకుల విజ్ఞప్తి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని నిర్వాహకులు పిలుపు నిచ్చారు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నిరాడంబరంగా సాగిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నిమజ్జనంతో ముగియనున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో నిమజ్జనం నిరాడంబరంగా సాగాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. నిమజ్జనం నిరాటంకంగా, సజావుగా సాగేందుకు పోలీసు విభాగం, జీహెచ్ఎంసీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుందని ఇప్పటికే ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనం నిరాడంబరంగా సాగనుంది. భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని నిర్వాహకులు పిలుపు నిచ్చారు. శోభాయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. ఖైరతాబాద్‌ వినాయకుడి ఊరేగింపునకు పోలీసు బందోబస్తు ఇవ్వకపోయినా, ప్రైవేట్ సెక్యూరిటీతో నైనా శోభాయాత్ర నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అటు బాలాపూర్ లో కూడా ఈ ఏడాది లడ్డూ వేలం నిర్వహించడం లేదని ఇప్పటికే నిర్వాహకులు స్పష్టం చేశారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Ganesh immersion, Khairatabad ganesh

ఉత్తమ కథలు