తప్పిపోయిన కుక్కను కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు... యజమానికి అప్పగింత...

Hyderabad Police : మనుషులు మిస్సైతేనే పట్టించుకోని పోలీసులు ఉన్న ఈ రోజుల్లో... హైదరాబాద్ పోలీసులు మిస్సింగైన కుక్కను కూడా కనిపెట్టడం విశేషమే.

news18-telugu
Updated: March 7, 2020, 6:17 AM IST
తప్పిపోయిన కుక్కను కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు... యజమానికి అప్పగింత...
తప్పిపోయిన కుక్కను కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు... యజమానికి అప్పగింత...
  • Share this:
Hyderabad Police : మిస్సింగ్ అయిన మనుషుల్ని కనిపెట్టడం తేలికే కావచ్చేమో గానీ... మిస్సింగ్ అయిన కుక్కల్ని కనిపెట్టడం కష్టం. ఎందుకంటే... మిస్సింగ్ అయిన వారు... ఎక్కడో ఒక చోటికి వెళ్లి... తిరిగి తమ వాళ్లకు కాల్ చేయగలరు. లేదా... తాము తప్పిపోయామని ఎవరికైనా చెబితే... వారి ద్వారానైనా తిరిగి కుటుంబీకుల్ని కలవగలరు. కానీ మూగజీవాలు మిస్సింగ్ అయితే... అవి తిరిగి ఓనర్‌ని చేరలేవు. తాము మిస్సింగ్ అయినట్లు ఎవరికీ చెప్పలేవు. కానీ... హైదరాబాద్ పోలీసులు... మిస్సింగ్ అయిన కుక్కను వెతికడమే కాదు... దాన్ని కనిపెట్టి... తిరిగి దాని యజమానికి అప్పగించారు. దాంతో ఆ యజమాని ఆనందానికి బ్రేకుల్లేకుండా పోయాయి.

తప్పిపోయిన కుక్కను కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు... యజమానికి అప్పగింత...


ఫిబ్రవరి 26న హైదరాబాద్... కుషాయిగూడకు చెందిన కుక్క యజమాని... పోలీసుల్ని కలిశాడు. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోకో (కుక్క పేరు) తప్పిపోయిందనీ, కనిపించట్లేదనీ తెలిపాడు. అసలే చాలా కేసుల్లో బిజీగా ఉన్న పోలీసులకు... ఈ కేసును తీసుకోవడం ఓ సమస్యగా మారింది. అయినప్పటికీ... డోంట్ వర్రీ... మీ కుక్కను ఎక్కడున్నా కనిపెడతాం అని భరోసా ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. తన కుక్క ఎలా ఉంటుందో చూపిస్తూ... ఆ వ్యక్తి... ఓ ఫొటోను పోలీసులకు ఇచ్చాడు. దాన్ని చూసిన పోలీసులు... కుక్క దొరకగానే కాల్ చేస్తామని చెప్పి అతన్ని పంపించారు. అలా వెళ్లిన యజమాని నిజంగా పోలీసులు కుక్కను వెతికి పెడతారని అనుకోలేదు. కానీ... పోలీసులు అతన్ని ఆశ్చర్యపరిచారు.

కుక్క మిస్సవగానే... ఎక్కడ మిస్సైందీ, ఎలా ఉంటుందీ వివరాలు తెలుసుకున్న పోలీసులు.... బ్లూ కోట్స్ ఆఫీసర్, క్రైమ్ టీమ్‌ని రంగంలోకి దింపారు. పోలీసులు తమదైన స్టైల్‌లో దర్యాప్తు చేసి... వారం పాటూ కష్టపడి... మొత్తానికి కుక్కను కనిపెట్టి... దాని యజమానికి అప్పగించారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు కుక్క యజమాని.
Published by: Krishna Kumar N
First published: March 7, 2020, 6:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading