• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD POLICE FINED RS 1000 FOR EX MAYOR TEEGALA KRISHNA REDDY FOR NOT WEARING MASK AK

మాస్క్ పెట్టుకోని హైదరాబాద్ మాజీ మేయర్.. రూ. 1000 ఫైన్ వేసిన పోలీసులు

మాస్క్ పెట్టుకోని హైదరాబాద్ మాజీ మేయర్.. రూ. 1000 ఫైన్ వేసిన పోలీసులు

కేసీఆర్‌తో తీగల కృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)

అంతా నిబంధనలు పాటించాల్సిందే అని.. ఈ విషయంలో తమకు అంతా సమానమే అని పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు.

  • Share this:
    కరోనా కట్టడికి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ప్రజలందరూ మాస్క్ పెట్టుకోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ పెట్టుకోవడంపై అవగాహన కల్పించడంతో పాటు మాస్క్ పెట్టుకోకపోతే రూ. 1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే మాస్క్ పెట్టుకోని అనేక మందికి జరిమానాలు విధించారు పోలీసులు. ప్రతిరోజూ అలాంటి వారికి ఫైన్‌లు వేస్తూనే ఉన్నారు. తాజాగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా విధించారు.

    తనిఖీలు చేస్తూ మాస్క్ లేని వారికి జరిమానాలు విధిస్తున్న తెలంగాణ పోలీసులు.. మాస్క్ లేకుండా కారులో ప్రయాణం చేస్తున్న తీగల కృష్ణారెడ్డికి రూ. 1000 జరిమానా విధించారు. ఈ క్రమంలో మాజీ మేయర్‌కు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అయితే అంతా నిబంధనలు పాటించాల్సిందే అని.. ఈ విషయంలో తమకు అంతా సమానమే అని పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు. అయితే టీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్‌కు ఈ రకంగా పోలీసులు ఫైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు