మూడ్రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad) ఎల్బీనగర్(LB Nagar)పరిధిలో అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి చనిపోయిన 12ఏళ్ల బాలిక(12year girl) డెత్ కేసులో మిస్టరీ వీడింది. ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఎందుకు అపార్ట్‌మెంట్ పైనుంచి దూకింది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ..? ప్రమాదవశాత్తు పడిందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలపై పోలీసులు(Police)సీసీ ఫుటేజ్(CCTV footage), బాలిక వచ్చిన ఆటో డ్రైవర్(Auto driver)తో పాటు అపార్ట్‌మెంట్ వాసులను విచారించిన పోలీసులు కేసులో మిస్టరీని చేధించారు.
మైనర్ బాలికది సూసైడ్..
ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట మధురానగర్‌కి చెందిన వర్షిత అనే 12సంవత్సరాల వయసు కలిగిన బాలిక మృతి స్థానికంగా కలకలం రేపింది. మధురానగర్‌కి చెందిన సత్యనారాయణరెడ్డి , ప్రభావతి దంపతుల రెండు కుమార్తె వర్షిత ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లి దగ్గర డబ్బులు తీసుకొని షాపుకు వెళ్లి చిప్స్ కొనుక్కుంటానని చెప్పి వెళ్లింది. ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన వర్షిత మన్సూరాబాద్ చౌరస్తా నుంచి ఆటోలో ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలోని రోడ్ నెంబర్ 2 దగ్గరున్న ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడి అపార్ట్‌మెంట్ నాల్గో అంతస్తుపై నుంచి దూకింది. తీవ్ర గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ విషయాన్ని పోలీసులకు చేరవడంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసులో మైనర్ బాలిక డెత్ కేసులో మిస్టరీని చేధించారు. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. చదువులో బాగా క్లవర్ స్టూడెంట్ అయిన వర్షిత ఇంటి దగ్గర కూడా అందరితో మంచిగా మాట్లాడేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న మనసు గాయపడటంతో ..
చనిపోయిన వర్షిత ఆటోలో చంద్రపురి కాలనీకి వెళ్తుండగా ఆటో డ్రైవర్ దుర్గేష్ ఫోన్ నుంచి తన తండ్రికే కాల్ చేసినట్లుగా డ్రైవర్ నుంచి నిజాన్ని రాబట్టారు. ఆ సమయంలో తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లిందని ఆటో డ్రైవర్‌కి 50 రూపాయలు ఇచ్చి బిల్డింగ్‌పైకి వెళ్తుండగా వాచ్‌మెన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్‌పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత వాచ్ మెన్ కొడుకును బిల్డింగ్‌పైకి వెళ్లి చూడమనడంతో ఇంతలోనే వర్షిత కిందకు దూకిందని తెలిపారు.
వీడిన మిస్టరీ ..
కేసును సవాల్‌గా తీసుకున్న ఎల్బీనగర్ పోలీసులు మిస్టరీని చేధించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని...ఎవరూ ఆమెను ట్రాప్ చేయలేదని తేల్చారు. సున్నిత మనస్కురాలైన వర్షిత కేవలం ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఘర్షణలకు మనస్తాపం చెంది ఈవిధంగా ప్రాణాలు తీసుకుందని ఎల్బీనగర్ పోలీసులు నిర్ధారించారు. పిల్లలకు అన్నీ విషయాలు అర్ధమయ్యేలా కుటుంబ సభ్యులు ప్రవర్తించకూడదని ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Minor girl, Suicide