హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైద‌రాబాద్ అల‌ర్ట్ ! అవ‌స‌రం ఉంటేనే బ‌య‌ట‌కి రండి.. పోలీసుల విజ్ఙ‌ప్తి! ఎందుకో తెలుసా? 

Hyderabad: హైద‌రాబాద్ అల‌ర్ట్ ! అవ‌స‌రం ఉంటేనే బ‌య‌ట‌కి రండి.. పోలీసుల విజ్ఙ‌ప్తి! ఎందుకో తెలుసా? 

వచ్చే 24 గంటల వరకు హైదరాబాద్​ ప్రజలు అనవసరంగా బయటకు రావోద్ద‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు,

వచ్చే 24 గంటల వరకు హైదరాబాద్​ ప్రజలు అనవసరంగా బయటకు రావోద్ద‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు,

వచ్చే 24 గంటల వరకు హైదరాబాద్​ ప్రజలు అనవసరంగా బయటకు రావోద్ద‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు,

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు (Rains) దంచి కొడుతున్నాయి. గ‌త ప‌దిరోజులుగా వ‌రుణ దేవుడు గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు మ‌రి కొన్ని ప్రాంతాల్లో భారీవ‌ర్షాలు కురిపిస్తున్నాడు. మ‌రో వైపు హైద‌రాబాద్ (Hyderabad) లో కూడా భారీ వ‌ర్షాలు ఎడ‌తెరిపి లేకుండ ప‌డుతున్నాయి. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు ఇప్ప‌టికే ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు పంపించారు అధికారు.  దీంతో పాటు హైద‌రాబాద్ వాసుల‌కు ప్ర‌త్యేక అభ్య‌ర్ధ‌న కూడా చేసుకుంటున్నారు. న‌గ‌రంలో గ‌త కొద్ది రోజులుగా కురుస్తోన్న‌ భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయటకు రావోద్ద‌ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఎదుర్కొనేందుకు పోలీసులు యంత్రాంగం సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే అధికారులు అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దీంతోపాటు పరిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే పోలీసు సిబ్బంది న‌గ‌రంలో ఉన్న ముంపు ప్రాంతాలలో 24 గంటలూ మోహరించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

  సైబరాబాద్ పోలీసులు HMWS&SB, NDRF, GHMC DRF, IMD, నీటిపారుదల శాఖ, రోడ్లు & భవనాలు, హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, కలెక్టర్ రంగారెడ్డి జిల్లాతో సంప్రదింపులు జరుపుతున్నారు. బుధవారం కమిషనర్ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ చెరువులను, సర్వీస్‌ రోడ్లను ప‌రిశీలించి పరిస్థితిని సమీక్షించారు. దీంతోపాటు విప‌త్తులో వెంట‌నే స‌హాయం కోసం ఒక ట్రోల్ ఫ్రీ నెంబ‌ర్ ను కూడా ప్రారంభించారు అధికారు సైబరాబాద్ వాట్సాప్ - 9490617444కు మెసేజ్ చేయాలని కమిషనర్ కోరారు.

  TSRTC: మహిళలకు టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రాఖీ పండుగ కానుకగా మరో ఆఫర్​..

  ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప‌డుతున్న వ‌ర్షాల‌కు ఉస్మాన్ సాగర్ ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తోంది దాని ప‌రిదిలో ఉన్న అనేక లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. హిమాయత్ సాగర్ నుండి భారీ మొత్తంలో నీటిని మూసీ నదిలోకి వదిలేయడంతో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మూసీ నది పరీవాహక ప్రాంతంల ముంపునకు గురయ్యే ప్రాంతాల న సుమారు 1,500 మందిని ఖాళీ చేయించి వారిని సమీపంలోని షెల్టర్ హోమ్‌లకు తరలించింది ప్ర‌భుత్వం. వరద నీటి ప్రవాహం పెరిగిన కారణంగా మూసీ దిగువ ప్రవహించే ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న 1500 మంది నివాసితులను ఖాళీ చేసి షెల్టర్ హోమ్‌లకు తరలించారు. పౌరులకు షెల్టర్ హోమ్‌లలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర‌స్తుతం అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని మేయర్ విజయలక్ష్మి మీడియాకు తెలిపారు. దీంతోపాటు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌కు ఎవ‌రైన ఆప‌ద‌లో ఉంటే సంప్ర‌దించాల‌ని కోరుతున్నారు అధికారు.

  First published:

  Tags: Heavy Rains, Hyderabad

  ఉత్తమ కథలు