ఆ జోన్‌లో లాఠీలు వాడొద్దు... హైదరాబాద్ సీపీ ఆదేశం

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సూచనల మేరకు నగర పోలీసులు లాఠీలు వాడొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: April 30, 2020, 5:52 PM IST
ఆ జోన్‌లో లాఠీలు వాడొద్దు... హైదరాబాద్ సీపీ ఆదేశం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్ డౌన్‌ ఉల్లంఘనలతో పాటు జనం గుమ్మిగూడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు తమ లాఠీలకు పని చెబుతున్నారు పోలీసులు. దీనిపై పలుసార్లు పోలీసులపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి సూచనల మేరకు నగర పోలీసులు లాఠీలు వాడొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా సౌత్ జోన్‌లో సామాన్యులను అదుపు చేసేందుకు లాఠీలు వాడొద్దని ఆయన స్పష్టం చేశారు. గోల్కండ, మీర్ చౌక్‌లో జరిగిన కొన్ని సంఘటనలు పోలీసులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయన్న ఆయన... కింది స్థాయి అధికారులు సిబ్బందికి ఈ విషయమై ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలని అన్నారు. రంజాన్ మాసం కావడంతో చాలామంది ఉపవాసాలు ఉంటారని... అలాంటి వారితో సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 30, 2020, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading