హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad pub drugs: హైదరాబాద్​ పబ్​లో డ్రగ్స్ వ్యవహారం​.. అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​.. 

Hyderabad pub drugs: హైదరాబాద్​ పబ్​లో డ్రగ్స్ వ్యవహారం​.. అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​.. 

CV-Anand

CV-Anand

హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసులో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీవీ ఆనంద్ (cv anand) .. పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసు (Hyderabad pub drugs)లో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బు (Radisson blu Pub)పై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారు. అయితే, తొలుత 144 మందిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చినా, అరెస్టయింది 45 మందే అని, మిగతా వారికి నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Police Commissioner CV Anand) తెలిపారు. డ్రగ్స్​ వ్యవహారం సంచలనం కావడంతో సీవీ ఆనంద్ (cv anand) .. పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్‌లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసుకు సంబందించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 కొకైన్ ప్యాకెట్లను సీజ్ చేశామని ..

ఈ సందర్భంగా వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ.. అనిల్ కుమార్ వద్ద భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద 5 కొకైన్ ప్యాకెట్లను సీజ్ చేశామని డీసీపీ చెప్పారు. కొకైన్‌ను డ్రింక్‌లో వేసుకుని తాగినట్లు గుర్తించామని తెలిపారు. బార్ కౌంటర్‌లో కూడా డ్రగ్స్ వుంచి సరఫరా చేస్తున్నట్లు డేవిస్ వెల్లడించారు. పబ్‌లో 100 మంది మద్యం సేవిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పబ్‌లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించేవారని.. కోడ్ చెప్పినవాళ్లకే పబ్‌లోకి అనుమతిస్తున్నారని డీసీపీ చెప్పారు. పబ్‌కి వచ్చే వారికి ఓటీపీ ఇచ్చి.. దాని ద్వారానే ఎంట్రీ ఇస్తున్నారని డేవిస్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే వారిని అదుపులోకి తీసుకుంటామని జోయల్ డేవిస్ చెప్పారు.

వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం..

అంతకుముందు మీడియాతో మాట్లాడిన కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand)​.. డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసలు దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా బంజాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన రాడిసన్ బ్లూ అనేది అంతర్జాతీయ హోటల్, క్లబ్ చైన్ కాగా, బంజారాహిల్స్ లోని ఫ్రాంచైజ్ పబ్.

First published:

Tags: Drugs case, Hyderabad police

ఉత్తమ కథలు