Home /News /telangana /

HYDERABAD POLICE COMMISSIONER CV ANAND HAS DIRECTED TO MAKE CHANGES IN THE WORKING HOURS OF PUBS AND BARS IN HYDERABAD FROM NOW ON PRV

Bars and Pubs: మందుబాబులకు అలెర్ట్​.. ఇక నుంచి బార్లు, పబ్​ల పనివేళ్లలో మార్పులు.. క్లోజింగ్​ ఎప్పుడంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పెట్టుబడిదారులను అధికంగా ఆకర్షిస్తున్నహైదరాబాద్ నగరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలాంటి సమయంలో కొంతమంది బార్లు పబ్బుల యజమానులు నిబంధనలను ఉల్లంఘించి నగరాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీ ఆనంద్​ పబ్​లు, బార్లకు షాక్​ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    పెట్టుబడిదారులను అధికంగా ఆకర్షిస్తున్నహైదరాబాద్ (Hyderabad) నగరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలాంటి సమయంలో కొంతమంది బార్లు పబ్బుల (Bars and Pubs) యజమానులు నిబంధనలను ఉల్లంఘించి నగరాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్​ సీవీ ఆనంద్ (Police Commissioner CV Anand)​ పబ్​లు, బార్లకు షాక్​ ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలో పబ్‌ల నిర్వహణకు  కొత్త రూల్స్ (New rules) పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు, బార్లు మూసి వేయాలని సీపీ ఆదేశించారు. మామూలుగా అయితే పబ్​లకు రాత్రి 12 గంటల వరకు సమయం ఇచ్చేవారు. ఇక వీకెండ్​లో మరో అరగంట అదనపు సమయం తెరిచి ఉంచేందుకు అనుమతి ఉండేది. అయితే పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.  నిర్దేశించబడిన వయసు కన్నా తక్కువ వయస్సు గలవారిని పబ్బులోనికి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని కూడా సీపీ ఆదేశించారు.

    రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు సౌకర్యం కోసం తీసుకుంటున్న చర్యల వలన నగరంలో పెట్టుబడులు  (Investments)పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలు, మహిళా సంరక్షణ, వేగవంతమైన క్లియరెన్స్ మరియు ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలకు విదేశీయులు ఆకర్షితులవుతున్నారని సీపి సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

    100 బార్లు, పబ్‌ల ప్రతినిధులతో సమావేశం..

    హైదరాబాద్​ నగరంలోని సుమారు 100 బార్లు, పబ్‌ల ప్రతినిధులతో ఆయన నేడు సమావేశం అయ్యారు. పబ్‌ల నిర్వహణకు కొత్త నియమావళిని సీవీ ఆనంద్ వారి ముందుంచారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పని సరిగా అమలు చేయాలని కోరారు. పబ్‌లు, బార్లలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల బ్యాక్ అప్ నెల రోజుల పాటు మెయింటైన్ చేయాలని  సీవీ ఆనంద్ ఆదేశించారు. సౌండ్ పొల్యూషన్ విషయంలో ఖచ్చితంగా నిబందనలు పాటించాలని… అట్లు పాటించని బార్లు, పబ్బులపై చర్యలు తీసుకుంటామని  సీవీ ఆనంద్ హెచ్చరించారు.

    సమావేశంలోకి ఆనంద్​ సిటీ పోలీస్ యాక్ట్ గురించి వివరిస్తూ, పోలీస్ యాక్ట్ నిబంధనల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యాపారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

    మరో గంట మినహాయింపు..

    లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘించాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సమావేశానికి హాజరైన వారందరికీ అయన పవర్ పాయింట్ ప్రజటేంషన్ ద్వారా పోలీసు చట్టంలో నిర్దేశించబడిన నిబంధనల గురించి తెలియచేశారు. రాత్రి 11 గంటలకు వచ్చే ఆర్డర్లను అంగీకరించవద్దని… శుక్ర,శనివారాల్లో బిల్ సెటిల్ చేయటానికి, అరగంట గ్రేస్ పీరియడ్ అదనంగా మరో గంట మినహాయింపు అనుమతించబడుతుందని చెప్పారు.

    అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంచబడుతుందని, అది సాధారణ ప్రజలకు కాదన్నారు. కాబట్టి 24 గంటలు మద్యం అందించే బార్లు, రెస్టారెంట్లు పబ్బులు ఇకపై అనుమతించబడవన్నారు నగర కమీషనర్.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Alcohol, Hyderabad, Hyderabad police, Police commissionarate

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు