ఆయన సీఐడీ సీఐ. గతంలో రెండు సార్లు ఏసీబీకి పట్టుబడ్డ అతను ఈసారి మరో విధంగా పట్టుబడ్డాడు. మహిళా సీఐ ఇంట్లోకి ప్రవేశించిన సీఐడీ సీఐపై పోలీస్ కేసు నమోదు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో సంచలనంగా మారిన ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న బాల రవి... తన సహచర మహిళా సీఐ ఇంటికి వెళ్లడంపై ఆమె భర్త రవికుమార్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రవికుమార్ కూడా మహబూబ్ బాద్ రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.
రూరల్ సీఐ రవికుమార్, అతని భార్య (మహిళా సీఐ)హనుమకొండలోని రాంనగర్ లో నివాసముంటున్నారు. ఈక్రమంలో మహిళా సీఐ ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని సీఐడీ సీఐ బాలరవి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంతలో ఇంటికి చేరుకున్న ఆమె భర్త రవికుమార్... ఆ సమయంలో బాలరవి తన ఇంటిలో ఉండడంపై ప్రశ్నించాడు. బాల రవి తిరిగి రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో బాలరవిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీఐ షుకుర్ తెలిపారు. గతంలోనూ సీఐ బాలరవిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇతని ప్రవర్తనపై పోలీస్ శాఖలోనూ జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal