#MakeHyderabadHonkfree : హైదరాబాద్‌ను హారన్ ఫ్రీగా మార్చేందుకు పోలీసుల క్యాంపెయిన్

హారన్ ఫ్రీ క్యాంపెయిన్‌లో భాగంగా జూన్ నెలలో నగరంలోని లక్షలాది మంది వాహనదారుల సెల్‌ఫోన్లకు సిటీ పోలీసులు కొన్ని సందేశాలు పంపించారు. 'ధ్వని కాలుష్యం ఆరోగ్యానికి హానికరం. మోటార్ వెహికల్ చట్టం 1989 119/120 ప్రకారం హాంకింగ్ నేరంగా పరిగణించబడుతుంది.

news18-telugu
Updated: September 6, 2019, 6:07 PM IST
#MakeHyderabadHonkfree : హైదరాబాద్‌ను హారన్ ఫ్రీగా మార్చేందుకు పోలీసుల క్యాంపెయిన్
హారన్ ఫ్రీ క్యాంపెయిన్‌లో భాగంగా జూన్ నెలలో నగరంలోని లక్షలాది మంది వాహనదారుల సెల్‌ఫోన్లకు సిటీ పోలీసులు కొన్ని సందేశాలు పంపించారు. 'ధ్వని కాలుష్యం ఆరోగ్యానికి హానికరం. మోటార్ వెహికల్ చట్టం 1989 119/120 ప్రకారం హాంకింగ్ నేరంగా పరిగణించబడుతుంది.
  • Share this:
హైదరాబాద్ నగరాన్ని హారన్ ఫ్రీగా మార్చేందుకు సిటీ పోలీసులు నడుం బిగించారు. ఇందుకోసం #MakeHyderabadHonkfree క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ట్విట్టర్‌లో ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. 'మీ డ్రైవర్‌కు చెప్పండి.. హారన్ కొట్టినంత మాత్రానా మీ కారు వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉండదు.హారన్ శబ్దం మీ గుండె,చెవులు,బీపీపై ప్రభావం చూపిస్తుంది.' అని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. అంజనీ కుమార్ పోస్ట్‌పై నెటిజెన్స్ నుంచి సానుకూల స్పందన వస్తోంది.

హారన్ ఫ్రీ క్యాంపెయిన్‌లో భాగంగా జూన్ నెలలో నగరంలోని లక్షలాది మంది వాహనదారుల సెల్‌ఫోన్లకు సిటీ పోలీసులు కొన్ని సందేశాలు పంపించారు. 'ధ్వని కాలుష్యం ఆరోగ్యానికి హానికరం. మోటార్ వెహికల్ చట్టం 1989 119/120 ప్రకారం హాంకింగ్ నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి హైదరాబాద్‌ను హాంక్ ఫ్రీ నగరంగా మారుద్దాం.' అని ఆ సందేశాల్లో పేర్కొన్నారు.


Published by: Srinivas Mittapalli
First published: September 6, 2019, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading