• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD POLICE AWARENESS ON FAKE CORONA MEDICINE AT ONLINE THROUGH TWITTER VB

Hyderabad: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్.. అతి తక్కువ ధరకే.. అలర్ట్ అయిన పోలీసులు..

Hyderabad: ఆన్‌లైన్‌లో కోవిడ్ మెడిసిన్స్.. అతి తక్కువ ధరకే.. అలర్ట్ అయిన పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: కరోనా మందులంటూ ఆన్ లైన్ లో సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. అటువంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలంటూ సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. దాని కోసం ట్విట్టర్ వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

  • Share this:
    కరోనా మహమ్మారి ప్రతీ ఒక్కరినీ వణికిస్తోంది. కరోనా సోకుతుందేమోననే భయంతో ఒకరు ఉంటే సోకిన వారు ఎలా భయట పడాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది కరోనా కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని వివిధ దందాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో కరోనా మెడిసిన్స్ అంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. కరోనా సోకిన వారు ఏమి చేయాలో అర్థం కాక ముందు ప్రాణాలను కాపాడుకోవాలనే తొందరలో ఇలా వారిని నమ్మి మోసపోతున్నారు. ఆన్ లైన్ ద్వారా సైబర్ కేటుగాళ్లు ఎప్పుడూ కాచుకొని కూర్చుంటున్నారు. వ్యాధి కంటే కరోనా బాధితులు భయం ఆందోళనకరంగా మారింది. కరోనా సోకిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి భయటపడే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది భయంతోనే మరణిస్తున్నారు. ఎక్క‌డో ఏదో జ‌రిగిపోతోందన్న గంద‌ర‌గోళం ప్ర‌జ‌ల్లో నెలకొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రు ఏది చెప్పినా వెంట‌నే ఆచ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొన్ని చిట్కాలను వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే జనాల భయాన్ని వాడుకొని వ్యాపారం చేసే వారు ఎక్కువగా తయారయ్యారు. ఆన్ లైన్ వేదికగా కరోనా చికిత్స కోసం మందులు అంటూ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి.

    భ‌యంతో ఉన్న ప్ర‌జ‌లు ముందూ వెనకా చూడ‌కుండా ఆన్‌లైన్‌లో మందుల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇంకేముంది మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవారికి కొదవ ఉండదు. అందుకే వాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ట్విట్టర్ వేదికగా పోలీసులు స్పందించారు. అన‌ధికారిక వెబ్‌సైట్లు, వ్య‌క్తుల నుంచి కోవిడ్ చికిత్స పేరుతో అమ్ముతోన్న‌మందుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో కొనుగోలు చేయ‌కండి.


    ఇవి ప్రాణాల మీద‌కు తీసుకొచ్చే ప్ర‌మాదం ఉందంటూ.. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ ను కూడా వారికి అనుకూలంగా మర్చుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారంటే.. వారిని ఏమనాలి. అందుకే వీటిపై జాగ్రత్తగా ఉండాలని.. అపరిచిత వ్యక్తుల నుంచి మెస్సేజ్ లు, మెయిల్ కు సంబంధించి ప్రతీ లింక్ ను క్లిక్ చేయకూడదని పోలీసులు సూచించారు.
    Published by:Veera Babu
    First published: