శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హీరో శివాజీ అరెస్ట్

టీవీ9 మాజీ సీఈఓతో రవిప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా కుమ్మక్కయ్యారన్న అలంద మీడియా ఆరోపణలు చేస్తోంది.

news18-telugu
Updated: July 3, 2019, 12:21 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హీరో శివాజీ అరెస్ట్
శివాజీ
  • Share this:
అలంద మీడియా కేసులో టాలీవుడ్ హీరో శివాజీని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయయను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమెరికా పారిపోతుండగా హీరో శివాజీని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయనకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

దేశం విడిచి పారిపోతుండగా శివాజీని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 సీఆర్పీసీ నోటీసులు జారీ చేస్తామన్నారు. శివాజీని విచారకణకు సహకరించాల్సిందిగా కోరామన్నారు. నోటీసులు ఆధారంగా శివాజీని విచారిస్తామన్నారు.అలంద మీడియా కేసులో ఇప్పటికే హైదారబాద్ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను విచారిస్తున్నారు.

తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిధుల్ని కూడా ఆయన దారి మళ్లించారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది.అలంద మీడియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు తనిఖీలు చేపట్టారు.రవిప్రకాష్‌తో పాటు హీరో శివాజీ కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>