హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్‌లో దొంగ బాబా హల్ చల్.. మత్తు మందు చల్లి నిలువునా మోసం

హైదరాబాద్‌లో దొంగ బాబా హల్ చల్.. మత్తు మందు చల్లి నిలువునా మోసం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌లో దొంగ బాబా హల్ చల్.. మత్తు మందు చల్లి నిలువునా మోసం చేశాడు. మాయమాటలు చెప్తూ బాబా మహిళను మాటల్లో పెట్టి...  ఆమె తేరుకునే లోపే బంగారం దోచేశాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో దొంగబాబాలు ఎక్కువైపోతున్నారు. అమాయక ప్రజల మూఢనమ్మకాల్ని క్యాష్ చేసుకొని వారిని అడ్డంగా మోసం చేస్తున్నారు. తాజాగాహైదరాబాద్‌ ఎల్బీనగర్ లో దొంగ బాబా హల్చల్ చేశాడు. మాయమాటలు చెప్తూ పలువురిఇల్లు గుల్ల చేశాడు. మహిళ తేరుకునే లోపే బంగారం దోచేశాడు. మత్తుమందు చల్లి బంగారం మటుమాయం చేసిన బాబా.. మరో రెండిళ్లలో కూడా ఇదే ప్లాన్ చేశాడు. అయితే అది కాస్త బెడిసి కొట్టింది. దీంతో దొంగ బాబా కథ అడ్డం తిరిగింది.

హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో దొంగ బాబా హల్చల్ చేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. మాయమాటలు చెప్తూ బాబా మహిళను మాటల్లో పెట్టి...  ఆమె తేరుకునే లోపే బంగారం దోచేశాడు. మత్తుమందు చల్లి బంగారం దోచుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి-రాము దంపతులు నివసిస్తున్నారు. రాము వ్యాపారం చేస్తున్నాడు. కాషాయం దుస్తులు ధరించిన బాబా వరలక్ష్మి ఇంటి వద్దకు వచ్చాడు. ఆమెను మాటల్లో పెట్టి ... అకస్మాత్తుగా మత్తుమందు చల్లాడు. మత్తు మందు చల్లగానే..  వరలక్ష్మి బాబా చెప్పినట్లే చేసింది.  మెడలో ఉన్న గొలుసు తీసి బాబాకు ఇచ్చింది. గొలుసు తీసుకున్న బాబా మెల్లగా బయటకు వెళ్లిపోయాడు.

ఇదంతా జరుగుతున్నా ఆమెకు మాత్రం ఏమీ తెలియదు. వరలక్ష్మిని మత్తు మందుతో మాయ చేశాడు,  వరుసగా పక్క ఉన్న రెండిళ్లలోకి కూడా వెళ్లాడు దొంగ బాబా. అయితే అక్కడ ఎవరూ దొంగ బాబా చేతిలో మోసపోలేదు. సకాలంలో మహిళ భర్త రావడంతో బాబా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన గురించి గాలించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు నిఘా పెట్టిన పోలీసులు బురిడీ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇంద్రప్రస్తా కాలనీలో మహిళ మెడ లో నుంచి మంగళ సూత్రాన్ని లాక్కిళ్లిన బురిడీ బాబాను నందనవనంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు