హోమ్ /వార్తలు /తెలంగాణ /

Drunk and drives: మందుబాబులకు అలెర్ట్​.. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర రెడ్ లైట్ పడితే అంతే.. డ్రంకెన్ డ్రైవ్​ టెస్ట్​.. పోలీసులు కొత్త ప్రణాళిక

Drunk and drives: మందుబాబులకు అలెర్ట్​.. ట్రాఫిక్​ సిగ్నల్​ దగ్గర రెడ్ లైట్ పడితే అంతే.. డ్రంకెన్ డ్రైవ్​ టెస్ట్​.. పోలీసులు కొత్త ప్రణాళిక

check post

check post

మద్యం (Alcohol) తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోయింది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ Drunk and drives)​​లు, నాకాబందీలు చేపట్టి జరిమానాలు విధించినా మారడం లేదు. అందుకే ఇకపై డ్రంకెన్ డ్రైవ్ (Drunk and drives)​లు చేపట్టే విధానం మార్చాలని పోలీసు శాఖ (Police department) నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

ఇటీవల మద్యం (Alcohol) తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోయింది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ Drunk and drives)​​లు, నాకాబందీలు చేపట్టి జరిమానాలు విధించినా, అవగాహన కల్పించినా వాహనదారులు మారడం లేదు. అందుకే ఇకపై డ్రంకెన్ డ్రైవ్ (Drunk and drives)​లు చేపట్టే విధానం మార్చాలని పోలీసు శాఖ (Police department) నిర్ణయించింది. ఇప్పటివరకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి రోజూ సాయంత్రం సమయాల్లో, స్పెషల్‌ డ్రైవ్‌లలో మాత్రమే డ్రంకన్‌ డ్రైవ్‌ Drunk and drives)​లు, నాకా బందీలు పెట్టేవారు. ప్రధాన ప్రాంతాలు, జంక్షన్లు వద్ద ప్రత్యేకంగా డీడీ పాయింట్లను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేవారు. బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌ (BAC) లెవల్‌ 30 దాటితే కేసులు నమోదు చేస్తుంటారు. బీఏసీ స్థాయిని బట్టి రూ.10 వేలు జరిమానాతో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేవారు. చాలా మంది మందుబాబులు డీడీ టెస్ట్‌లు పూర్తయ్యాక ఇంటికి వెళ్లడం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్‌ సిగ్నల్స్ (Traffic signals), జంక్షన్ల వద్దే డీడీలు నిర్వహిస్తే కరెక్టు అనే అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. సిగ్నల్‌ పాయింట్‌ వద్ద డ్యూటీలో ఉండే ట్రాఫిక్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ బ్రీత్‌ అనలైజర్‌తో రెడీగా ఉంటారు. రెడ్‌ సిగ్నల్‌ (Red signal) పడగానే వాహనదారుల వద్దకు వెళ్లి డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, వెస్ట్-సెంట్రల్ అనే ఆరు జోన్లున్నాయి. ఈ జోన్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు.  ఇటీవలె తెలంగాణలో ముఖ్యంగా నగరాల్లో రోడ్డు ప్రమాదాలు  ఏ ఏ సమయాల్లో జరుగుతున్నాయనే విషయమై పోలీసులు అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దీంతో రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని పోలీసులు భావిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. రాత్రి పూట పోలీసులు చెక్ పోస్టులపై దృష్టి పెట్టనున్నారు.

మరోవైపు హైదరాబాద్​ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డ్రంకెన్​ డ్రైవ్‌ Drunk and drives)​ కేసులు పరిష్కరించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు. డీడీలో చిక్కిన మందుబాబులకు రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా రద్దవుతుంది. ప్రస్తుతం తొలిసారి డ్రంకన్‌ డ్రైవ్‌ Drunk and drives)​లో చిక్కిన మందుబాబులకు రూ.2,001 జరిమానా చెల్లించే వెసులుబాటును కల్పించారు. కేసులు పెండింగ్‌లో ఉన్న ఎప్పటికైనా ప్రమాదమేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా మంది డీడీ నిందితులు పెండింగ్‌ జరిమానాను చెల్లించేందుకు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో 70 వేలకు పైగా డీడీ కేసులుంటాయని అంచనా.

First published:

Tags: Drunken drive test, Hyderabad, Hyderabad Traffic Police

ఉత్తమ కథలు