హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : హైదరాబాద్‌లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం .. ఇద్దరు మైనార్టీ మహిళల్ని విచారిస్తున్న పోలీసులు

Hyderabad : హైదరాబాద్‌లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం .. ఇద్దరు మైనార్టీ మహిళల్ని విచారిస్తున్న పోలీసులు

Goddess idol vandalized

Goddess idol vandalized

Hyderabad: ఖైరతాబాద్ నియోజకవర్గం చింతల్‌ బస్తీలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి మంగళవారం ఉదయం పూజలు చేస్తున్న సమయంలో మండపం లోపలికి చొరబడ్డ ఇద్దరు మైనారిటీ మహిళలు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అడ్డుకోబోయిన వారిపై దాడి చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో దేవినవరాత్రుల వేడుకల్లో విధ్వంసకర చర్యలకు పాల్పడ్డారు ఇద్దరు మైనారిటీ మహిళలు( minority womens). ఖైరతాబాద్ (Khairatabad) నియోజకవర్గం చింతల్‌ బస్తీ(Chintal Basti)లో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి మంగళవారం(Tuesday)ఉదయం పూజలు చేస్తున్న సమయంలో మండపం లోపలికి వచ్చిన ఇద్దరు మైనారిటీ మహిళలు దుర్గామాత(Goddess Durga) విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మండపంలో పూజచేస్తున్న భక్తుడు వెంకటేష్ (Venkatest) విగ్రహం ధ్వంసం చేసేందుకు వచ్చిన మహిళల్ని ఎందుకొచ్చారు.. ? ఏం చేస్తున్నారు..? అని అడిగే క్రమంలోనే ఒక రాడుతో దాడికి దిగారు.

OMG :హెడ్‌ మాస్టర్ వల్ల ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మృతి .. ప్రాణానికి లక్ష ఖరీదు కట్టిన గ్రామ పెద్దలు

అమ్మవారి విగ్రహం ధ్వంసం..

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం...దాడికి పాల్పడిన వెంటనే అక్కడి నుంచి పారిపోతున్న ఇద్దరు మైనారిటీ మహిళలను స్థానికులు ఫఆలో అయ్యారు. సదరు మహిళలు ఇద్దరూ అదే బస్తీలోని చర్చిలో కూడ మరియామాత విగ్రహంపై దాడి చేశారు.ఇదంతా గమనించిన స్థానికులు పోలీసులకు తీసుకొని రావడంతో ఇద్దరు మహిళల్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి మహిళలిద్దర్ని సైఫాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సెంట్రల్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు.

ఇద్దరు మైనార్టీ మహిళలు..

విగ్రహాలను ధ్వంసం చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు మైనారిటీ మహిళలను పట్టుకోవడానికి ప్రయత్నించిన వెంకట్, సోయేల్‌ను కొరికారు. చేతులపై గాట్లు పడ్డాయి. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు మహిళల దగ్గర ఇనుప రాడ్డు, చిన్న చాకు, సర్ఫ్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్‌ని పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరూ మహిళలు విచారణలో ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Viral video : పరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న వృద్ధుడు .. వైరల్ అవుతున్న వీడియో

పోలీసుల అదుపులో మహిళలు..

ఇద్దరూ మహిళలు విచారణకు సహాకరించకుండా మతిస్థిమితం లేని వాళ్లలా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్లను పట్టుకున్న బస్తీవాసులు, స్థానికులు మాత్రం పథకం ప్రకారమే దాడులు, విధ్వంసం చేయడానికి వచ్చారని మండిపడుతున్నారు. పట్టుబడిన ఇద్దరూ మైనార్టీకి చెందిన మహిళలు కావడం ..అమ్మవారి విగ్రహంతో పాటుగా చర్చిలోని మరియామాత విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో హైదరాబాద్‌లో ఇది సంచలన వార్తగా మారింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Telangana News

ఉత్తమ కథలు