నిమజ్జనం రోజు మెట్రోలోనే ప్రయాణించండి.. పోలీసుల విజ్ఞప్తి

Ganesh Immersion : నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌పై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అనిల్ కుమార్ తెలిపారు.ఎయిర్‌పోర్ట్,రైల్వే స్టేషన్,బస్టాండ్స్,పంజాగుట్ట మార్గాల నుంచి వచ్చేవారు నెక్లెస్ రోడ్,ఎన్టీఆర్ మార్గ్,ట్యాంక్‌బండ్ మార్గం గుండా కాకుండా..వేరే మార్గాల్లో వెళ్లాలని పోలీుసలు సూచిస్తున్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 7:26 AM IST
నిమజ్జనం రోజు మెట్రోలోనే ప్రయాణించండి.. పోలీసుల విజ్ఞప్తి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గణేశ్ నిమజ్జనం రోజు హైదరాబాద్‌లో అడుగడుగు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతుంది. బైక్స్‌,కార్లలో ప్రయాణం చేసేవాళ్లకైతే.. బండి ఒక అడుగు ముందుకు కదలడమే గగనమే. అందుకే నిమజ్జనం రోజు బైక్స్,కార్ల కంటే మెట్రో లేదా ఎంఎంటీఎస్‌లో ప్రయాణించడం బెటర్ అని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఆరోజు గణపతులన్నీ నిమజ్జనం కోసం
ట్యాంక్‌బండ్‌కు తరలుతాయి కాబట్టి.. ఆవైపుగా వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించరు. భారీ వాహనాలను నగర శివార్లలోనే ఆపేస్తారు. ఆర్టీసీ బస్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌పై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అనిల్ కుమార్ తెలిపారు.ఎయిర్‌పోర్ట్,రైల్వే స్టేషన్,బస్టాండ్స్,పంజాగుట్ట మార్గాల నుంచి వచ్చేవారు నెక్లెస్ రోడ్,ఎన్టీఆర్ మార్గ్,ట్యాంక్‌బండ్ మార్గం గుండా కాకుండా..వేరే మార్గాల్లో వెళ్లాలని పోలీుసలు సూచిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. సహాయం కావాలనుకునేవారు 040-27852482, 9490598985 నంబర్లలో సంప్రదించవచ్చు.First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు