Home /News /telangana /

HYDERABAD POLICE ANNOUNCED THAT BODHAN MLA SHAKEEL SON RAHEEL ALSO IN THAT CAR WHICH IS CAUSED THE ACCIDENT IN JUBILEE HILLS HYDERABAD PRV

Jubilee hills car Accident: జూబ్లీహిల్స్​ కారు ప్రమాదం ఘటనలో షాకింగ్​ ట్విస్టు.. కారులో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కుమారుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు (jubilee hills car crash) అనూహ్య మలుపు తిరిగింది. బాలుడి మృతికి కారణమైన కారులో బోధన్​ ఎమ్మెల్యే షకీల్ (bodhan mla shakeel) కుమారుడు రాహిల్ (raheel) వున్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు (Jubilee hills car accident) అనూహ్య మలుపు తిరిగింది. బాలుడి మృతికి కారణమైన కారులో బోధన్ TRS​ ఎమ్మెల్యే షకీల్ (Bodhan MLA shakeel) కుమారుడు రాహిల్ (Raheel) వున్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కుమారుడిని తప్పించేందుకు TRS ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కారు తన బంధువులదని, తన కుమారుడు కారులో లేరని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు షకీల్ కుమారుడు (MLA Shakil son) కారులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

    ఏసీపీ సుదర్శన్‌ మాట్లాడుతూ.. ఫిలింనగర్ నుంచి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో MLA కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు.

    ఏం జరిగింది? 

    ఈనెల 17న రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ (Hyderabad)లోని మాదాపూర్‌ నుంచి టీఆర్‌ నంబరుతో ఉన్న వాహనం కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1/45 జంక్షన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పిన కారు అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు అమ్మకుంటున్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్‌చౌహాన్‌, సారిక చౌహాన్‌, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది (Jubilee hills car accident).

    దీంతో కాజల్‌ చౌహాన్‌ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్‌ చౌహాన్‌, సారిక చౌహాన్‌ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్‌ ఎగిరి కిందపడ్డారు. ఈ ఘటనలో రణవీర్‌ చౌహాన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్‌ నంబరు 1 వైపు పరారయ్యాడు అని అక్కడ ఉన్న పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ఈ కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తో తిరుగుతుంది. కారుపై బోధన్ ఎమ్మెల్యే Shakeel స్టిక్కర్ కూడా ఉంది. కారు మొత్తానికి బ్లాక్ గ్లాస్ ఉంది. దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరున్నారనే విషయం గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెపపారు. మరో వైపు ప్రమాదం జరిగిన చోట CCTV కెమెరాలు లేవని కూడా పోలీసులు తెలిపారు. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో ఈ కారును కొనుగోలు చేసినట్టుగా రవాణా శాఖ అధికారుల వద్ద సమాచారాన్ని బట్టి పోలీసులు గుర్తించారు. మూడు మాసాల క్రితం ఈ కారును కొనుగోలు చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Car accident, Hyderabad, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు