విమానం(Plane)లో కూర్చోవాలని..అందులో డిన్నర్, లంచ్ చేయాలని..ఫ్లైట్ కూర్చొని ప్రకృతిలోని అందాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ కోరిక తీర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే డిసెంబర్ (December)నెల నుంచి అతి తక్కువ ఖర్చుతోనే ఈ సౌకర్యం, లగ్జరీ ఫీలింగ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. పిస్తా హౌస్ రెస్టారెంట్ (Pista House restaurant) నిర్వాహకులు ఎయిర్‌బస్-320(Airbus-320)ని కొనుగోలు చేసి దాన్ని ఫ్లైట్ రెస్టారెంట్‌గా హైదరాబాద్(Hyderabad)శివారు ప్రాంతమైన శామీర్‌పేట(Shamirpet)లో ఏర్పాటు చేస్తున్నారు. జంటనగరాల ప్రజలకు బ్రాండ్ నేమ్‌తో ఉన్న బిర్యానీతో పాటు ఫ్లైట్ అనుభూతిని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విమానంలో విందు..
దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పిస్తా హౌస్ రెస్టారెంట్ నిర్వాహకులు హైదరాబాద్‌లో ఓ వెరైటీ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగరవాసుల టేస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ రెస్టారెంట్‌ని శామీర్‌పేటలో ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ ప్లేన్ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నారు. పాతదైన ఎయిర్‌బస్-320ని వేలంలో 75లక్షలకు కొనుగోలు చేసిన పిస్తాహౌస్ యాజమాన్యం 150మంది సిట్టింగ్ కెపాసిటీకి తగినట్లుగా రెస్టారెంట్‌గా మార్చుతోంది. కస్టమర్లు కూర్చొని డిన్నర్, లంచ్ చేసే విధంగా ఈ ఎయిర్ బస్ని డిజైన్ చేస్తున్నారు. ఫ్లైట్ జర్నీ ఫీలింగ్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్‌ని డిజైన్ చేయడంతో పాటుగా రన్ వే, సెక్యురిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లోనే టికెట్ల కొనుగోలు వంటి వాటిని ఏర్పాటు చేసింది.
థ్రిల్లింగ్ కోసం ..
కేరళలో కొనుగోలు చేసిన ఈ ఎయిర్‌బస్ -320ని కొచ్చి నుంచి ఏపీ మీదుగా హైదరాబాద్‌కు తెస్తుండగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బాపట్ల జిల్లాలోని అండప్ పాస్ మార్గంలో తీసుకొస్తుండగా చిక్కుకుపోవడంతో మేదరమెట్ల పోలీసుల సహకారంతో ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
పిస్తా హౌసా మజాకా..
దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా పిస్తా హౌస్ తమ వ్యాపార సంస్థల్ని నెలకోల్పి మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 32బ్రాంచీలను ఏర్పాటు చేసింది పిస్తా హౌస్. మొదటి బ్రాంచ్ని శాలిబండలో 1997ప్రారంభించారు. అక్కడి నుంచి పిస్తా హౌస్ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, మలేషియా, సింగపూర్ లాంటి విదేశాల్లో కూడా శాఖలను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పిస్తా హౌస్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది హలీమ్. పిస్తా తయారు చేసే హలీమ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాగే ఈ రెస్టారెంట్ యాజమాన్యం సర్వ్ చేసే ఆహార, తినుబండారాలకు అంతే స్పెషాలిటీ ఉంది.
న్యూ ఇయర్లో ఓపెన్..
హైదరాబాద్ తరహాలోనే గుజరాత్‌లోని వడోదరలో కూడా ఓపెన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద మందికిపైగా కస్టమర్లు కూర్చొని తినే విధంగా డిజైన్ చేశారు. సర్వర్లు, వెయిటర్లు, ఎయిర్ హోస్టెస్,స్టీవర్డ్స్ తరహాలోనే ప్రత్యేక డ్రెస్ డిజైన్‌తోనే కస్టమర్లకు సర్వీసులు అందజేస్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ ప్లైన్ రెస్టారెంట్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంటుందని...హైదరాబాదీల మనసు దోచుకుంటుందని పిస్తా హౌస్ రెస్టారెంట్ నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News