హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : కాబోయే లేడీ పోలీస్‌ కానిస్టేబుల్‌కి సీఐ హెల్ప్ .. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే

Hyderabad : కాబోయే లేడీ పోలీస్‌ కానిస్టేబుల్‌కి సీఐ హెల్ప్ .. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే

Lady CI help

Lady CI help

Hyderabad: కానిస్టేబుల్ ఉద్యోగానికి రాత పరీక్ష కోసం వచ్చిన ఓ మహిళకు సీఐ ఎంతో ఉపకారం చేశారు. చంటి బిడ్డను ఎత్తుకొని ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన తల్లిని పరీక్ష రాయడానికి పంపి..ఆమె వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు ఆ వార్తే వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉద్యోగం పురుష లక్షణం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఉద్యోగం ప్రతి మనిషి అవసరంగా మారింది. అందుకే ఏ చిన్న ఉద్యోగ అవకాశం ఉన్నా..ప్రభుత్వం ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. ఉద్యోగ సాధన కోసం ముందుకుపోతున్నారు. తెలంగాణ(Telangana)లో పోలీస్ కానిస్టేబుల్ (Police Constable)ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఓ చంటి బిడ్డ తల్లి ఎగ్జామ్(Exam)రాయడానికి హైదరాబాద్‌ నగరానికి వస్తే ఎగ్జామ్ సెంటర్‌ దగ్గర ఆమెకు ఊహించని విధంగా సహకారం లభించింది.

Telangana : రేషన్‌ షాపులో ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై హరీష్‌రావు కౌంటర్చంటి బిడ్డను ఆడించిన సీఐ..

ఆగస్ట్ 28వ తేదిన తెలంగాణలో భర్తీ చేయాల్సిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం మొత్తం 6,61,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇన్ని వేల మందిలో ఓ అభ్యర్ధురాలు తన చంటి బిడ్డను ఎత్తుకొని హైదరాబాద్‌లో ఎగ్జామ్ రాయడానికి వెళ్లింది. ఓ వైపు రాత పరీక్షకు టైమ్ అవుతోంది. చేతిలో ఉన్న పిల్లవాడ్ని ఎవరికి అప్పగించాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో ఆమె పాలిట సుల్తాన్‌ బజార్‌ సీఐ పద్మ తన బిడ్డకు తల్లిగా మారింది.

తల్లి ఎగ్జామ్‌ హాలులో బిడ్డ సీఐ ఒడిలో ..

పిల్లాడిని చూసుకునేందుకు ఎవరూ లేక ఇబ్బంది పడుతుండటం చూసిన సుల్తాన్‌ బజార్ సీఐ పద్మ పోలీస్ కానిస్టేబుల్ కావాలనే పట్టుదలతో పసిబిడ్డను తెచ్చిన మహిళ పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. ఆ చంటి పిల్లవాడ్ని దగ్గరకు తీసుకున్నారు. పిల్లాడి తల్లిని పరీక్షకు పంపిన సీఐ పద్మ ఆ పసివాడ్ని తల్లి వచ్చే వరకు తన ఒడిలో కూర్చొబెట్టుకొని ఆడిచారు. పిల్లాడితో ఫోటోలు దిగారు. నిత్యం నేరస్తులు, నేరాల పరిశోధనలో కఠినంగా ఉండే ఆఫీసర్ పసివాడ్ని ఆడిస్తూ ఏడవకుండా కన్నతల్లిని మరిపించారు సీఐ పద్మ. ఈనెల 28న ఈ సంఘటన జరిగితే సీఐ పద్మ తన ట్విట్టర్‌లో పిల్లవాడితో పంచుకున్న ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ అమ్మ పరీక్ష హాల్లో.. నేను పోలీస్ ఫ్రెండ్స్‌తో' అనే క్యాప్షన్ పెట్టి ఫోటోని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

OMG: గణేష్‌ మండపాల్లో లడ్డూ , హుండీ, నోట్ల దండలు మాయం .. చేసిందెవరో మీరే చూడండిప్రశంసల వెల్లువ ..

పోలీస్‌ అధికారిణి తన పోస్ట్, పవర్ రెండు పక్కన పెట్టి చంటి పిల్లాడ్ని ఆడించడమే కాకుండా ...సాటి మహిళకు సాయం చేసి తాను పని చేస్తున్న డిపార్ట్‌మెంట్‌లోనే ఉద్యోగం సంపాధించుకునేందుకు సహాయం చేసారంటూ సోషల్ మీడియాలో సుల్తాన్‌ బజార్ సీఐ పద్మను అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పోలీస్ శాఖలో 15,644, ఎక్సైజ్ శాఖలో 614, రవాణా శాఖలో 63 పోస్టుల భర్తీకి ఈ నెల 28న ఈ రాత పరీక్ష నిర్వహించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana News, VIRAL NEWS

ఉత్తమ కథలు