HYDERABAD PHARMA AGENT HELD FOR CHEATING HYDERABAD
Cheating Case: లాభాల ఆశచూపి.. మోసం
ప్రతీకాత్మకచిత్రం
కరోనా సమయంలో మాస్కులు అమ్మితే భారీగా లాభాలు వస్తాయని ఓ మందల కంపెనీ ఎండీ వద్ద నుంచి ఓ ఫార్మా ఏజెంట్ రూ.1.12కోట్లు వసూలు చేసి నాసిరమైన మాస్కులు అంటగట్టాడు. దీంతో ఖంగతున్న మందుల కంపెనీ యజమాని పోలీసులను ఆశ్రయించాడు.
కరోనా నుంచి మనకి రక్షణ కల్పించేంది మాస్క్.. వీటిని కచ్చితంగా కొంటారని మాస్క్‌లను అమ్మితే లాభాలు బాగా వస్తేయని చెప్పి ఓ ఫార్మా కంపెనీ ఏజెంట్ వికాస్ గుప్తా, ఓ కంపెనీ ప్రతినిధితో కలిసి తన వద్ద నుంచి రూ.1.12కోట్లు తీసుకొని నాసికరమైన సరుకు పంపించారని మందుల కంపెనీ ఎండీ అగర్వాల్ నారాయణగూడాకు చెందిన హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా..
మాస్క్‌లు విక్రయిస్తే లాభాలు బాగావస్తాయని చెప్పడంతో రూ.1.12 కోట్లు మందుల కంపెనీ ఎండీ నుంచి వసూలు చేసి నాసిరమైన సరుకు పంపించారు. ఈ సరుకు వెనక్కు తీసుకోవాలని ఫార్మా ఏజెంట్‌ను కోరగా వెనక్కి తీసుకుంటామని.. మళ్లీ ఆర్డర్ ఇవ్వండని చెప్పాడు. దీంతో మందుల కంపెనీ ఎండీ తిరిగి ఆర్డర్ ఇవ్వగా 104 పెట్టెల్లో మాస్కుల పంపినట్టు ఫోన్ ద్వారా తెలిపారు. వాటని పరిశీలించగా మరింత నాసిగా ఉన్నట్టు గుర్తించి మందుల కంపెనీ ఎండి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.