హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ramzan: రంజాన్‌ జోష్‌.. ఇక్కడ అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌!

Ramzan: రంజాన్‌ జోష్‌.. ఇక్కడ అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌!

X
atthar

atthar

ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు తయారు చేసి అమ్ముతున్నారు. నాలుగు శతాబ్దాలుగా ఈ వ్యాపారం సాగుతోంది. కొన్ని షాపులు 150 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. నాలుగోతరం వ్యక్తులు ఆ షాపులను నడుపుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(దస్తగిరి, న్యూస్‌-18 తెలుగు, రిపోర్టర్‌)

హైదరాబాద్ పాతబస్తీ అనగానే గుర్తుకు వచ్చేది ఛార్మినార్. ఈ పురాతన కట్టడం చుట్టూ అనేక వ్యాపారాలు వేల ఏళ్లుగా నడుస్తున్నాయి. ఇక్కడ దొరికే గాజులు, ఇరానీ ఛాయ్, పెరల్స్ దేశ వ్యాప్తంగానే కాదు, అనేక దేశాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఛార్మినార్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి అత్తర్లు. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు తయారు చేసి అమ్ముతున్నారు. నాలుగు శతాబ్దాలుగా ఈ వ్యాపారం సాగుతోంది. కొన్ని షాపులు 150 సంవత్సరాలుగా నడుస్తున్నాయి. నాలుగోతరం వ్యక్తులు ఆ షాపులను నడుపుతున్నారు.

అత్తరు చరిత్ర:

పురాణ్ దాస్ కుటుంబం 1896లో బుర్హాన్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి పాతబస్తీలో స్థిరపడిపోయింది. వారు మొదట హైదరాబాద్ లో అత్తర్ల వ్యాపారం మొదలు పెట్టారు. పురానా దాస్ కుటుంబంలో నాలుగోతరం వ్యక్తి శైలేంద్ర ప్రసాద్ ప్రస్తుతం వారి అత్తర్ల వ్యాపారం నడుపుతున్నారు. వీరి వద్ద 500 కంటే ఎక్కువ రకాల అత్తర్లు అందుబాటులో ఉన్నాయి. సహజ సిద్దంగా తయారు చేసిన అత్తర్లతో పాటుగా సింథటిక్ అత్తర్లు కూడా ఛార్మినార్‌ దగ్గర అత్తర్లు అమ్మే వ్యాపారుల దగ్గర లభిస్తుండటం విశేషంగా చూడాలి. 10మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు కూడా వీరి వద్ద లభిస్తాయి. వినియోగదారుల అవసరాలను బట్టి 10 మి.లీ నుంచి ఎంత కావాలన్నా వీరి వద్ద లభిస్తుంది. గులాబీ, మల్లె, చేమంతి ఇలా అనేక రకాల పూల నుంచి వీరు అత్తరులు తయారు చేస్తారు. ఛార్మినార్ అత్తరు వ్యాపారులు పూల నుంచే కాదు సుగంధ పరిమణాలు కలిగిన గంధం నుంచి కూడా అత్తరు తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ తోటల నుంచి పూలను సేకరిస్తారు. ముందుగా పూలను కొంచెం ఎండబెట్టి తరవాత వాటి నుంచి అత్తరులు సేకరిస్తారు.

అక్కడ అత్తరులు తయారీపై 10 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. అక్కడ నుంచి కూడా ఛార్మినార్ వ్యాపారులు అత్తరులు తెప్పిస్తున్నారు. చలి కాలంలో షామతుల్ అమ్, హ్రీనా, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటి అత్తర్లు వాడితే ఒంటికి వెచ్చదనం లభిస్తుంది. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మా, షాజహాన్, మన్నా, నాయబ్, హుప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమతుల్ అంబర్, హీనా, జాఫ్రత్, దహనుల్ ఊద్ వంటి అత్తర్లుమార్కెట్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వాడే కస్టమర్లు ప్రత్యేకించి తెప్పించుకోవడం, తయారు చేయించుకోవడం కూడా జరుగుతుంది.

అరబ్‌ దేశాల్లో ఉపయోగించే అత్తరు:

ఇక్కడి మార్కెట్లో లభించే కొన్ని రకాల అత్తర్లు తులం రూ.200 నుంచి మొదలవుతున్నాయి. అంటే వాటి ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో ఉపయోగించే దహనల్ ఊద్ అనే అత్తరు తులం రూ.2 వేల నుంచి రూ.6వేల ధర పలుకుతోంది. రాత్ కి రాణి, ముస్క్ రోజ్, బ్లాక్ ముస్క్, వైట్ ముస్క్, కూలీ బ్రీజ్, జమ్ జ్ ప్లవర్ అత్తర్లు చాలా ఖరీధైనవి. వీటిని 3 మి.లీ నుంచి అమ్ముతారు. వీటి ధర 3 మి.లీలకు రూ.30 తీసుకుంటారు. సాధారణ రోజుల్లో అత్తరు వ్యాపారం కంటే రంజాన్‌, పండుగ రోజుల్లో రెట్టింపు ఉంటుందంటున్నారు ఇక్కడి వ్యాపారులు.

రంజాన్ మాసం వస్తే చాలు.. ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసరాలు మరింత రద్దీగా మారతాయి. గాజుల నుండి అత్తర్ వరకు రంజాన్ సీజన్ లో ఇక్కడ దొరికే వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. చిన్న చిన్న దుకాణాలు ఇక్కడ వందల సంఖ్యలో ఉంటాయి. వీటిలో అత్తర్ విక్రయించే కొన్ని చిన్న దుకాణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని 1897 నుండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడకి వచ్చే సాధారణ ప్రజలకివి దాదాపు క్యూరియో షాపుల లాగా కనిపిస్తాయి.

First published:

Tags: Hyderabad, Ramzan