హోమ్ /వార్తలు /తెలంగాణ /

liquor Home delivery: మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయం ఏంటంటే..? హైదరాబాదీల మనసులో మాట ఇదే

liquor Home delivery: మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయం ఏంటంటే..? హైదరాబాదీల మనసులో మాట ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home delivery: కరోనా కష్టాలు వెంటాడుతున్నా..? ఆదాయ మర్గాలు తగ్గిపోయినా..? మద్యం తాగేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. రోజు రోజుకూ పెరిగిపోతోంది. మద్యం షాపులు తెరవడమే ఆలస్యం.. క్యూ కట్టేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను కూడా గాలికి వదిలేసి గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఎంతలా అంటే? ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే.

ఇంకా చదవండి ...

Good News to Liqour Lovers: ప్రపంచం (World) మొత్తాన్ని భయపెట్టిన కరోనా (Corona) కష్టకాలంలోనూ మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేవి వైన్ షాప్ (Liqour Shops)లు మాత్రమే. వైన్ షాపులు దగ్గర మద్యం కిటకిటను తగ్గించేందుకు మద్యం హోండెలివరీ (Liqour Home Delivery) విషయంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు (State Government)కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హోం డెలివరీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) ఇటీవల 8 రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనంలో 100% మంది హైదరాబాదీలు (Hyderabad people) మాత్రమే మద్యం హోండెలివరీ సేవను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు.. ఆ సర్వేలో తేలింది. ప్రముఖ నగరాలలో సగటు 70% మంది నిజామాబాద్ (Nizamabad), ఆదిలాబాద్ (Adilabad), కరీంనగర్ (Karimnagar), వరంగల్ (Warangal), సంగారెడ్డి (Sangareddy), నల్గొండ (Nalgonda)వంటి తెలంగాణ (Telangana)లోని ఇతర ప్రాంతాలలో హోమ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నట్లు సర్వేలో గమనించారు. ఇప్పటికే మేఘాలయ, పంజాబ్‌, పుదుచ్చేరి, న్యూఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేస్తుండగా.. మరిన్ని రాష్ట్రాలు కూడా మద్యం హోండెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మద్యం హోం డెలివరీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ISWAI సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణకు సంబంధించి 7వేల 500 మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో వంద శాతం మంది మద్యం హోమ్ డెలివరీకి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి.. మొత్తం డబ్బును చెల్లిస్తే సమీపంలోని వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా జరిగేలా ఏర్పాట్లు చెయ్యాలని చాలామంది మద్యం ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో మద్యం తాగేవారి నుంచి తీసుకున్న వివరాల ప్రకారం.. 100 శాతం మంది మద్యం హోం డెలివరీకి సపోర్ట్ చెయ్యగా.. వారిలో, దాదాపు 60% మంది సౌలభ్యం కోసం హోమ్ డెలివరీ బాగుంటుందని, 40% మంది సామాజిక దూరం, భద్రత కోసం సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మీలో ఫిట్ నెస్ తగ్గిందని ఇలా తెలుసుకోండి.. శరీరాకృతి మారిందని తెలిపే సంకేతాలు ఇవే!

ఇంకా 50% ప్రతి హోం డెలివరీ చేసినందుకు 50 రూపాలయ నుంచి 100 రూపాయల వరకు ఫీజును ఇచ్చేందుకు ఇష్టపడగా.. మిగిలిన వారు ఆర్డర్ విలువలో 5% నుంచి 10% వరకు ఫీజు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొంత మంది హోం డెలివరీ వల్ల మద్యం ధరల్లో పారదర్శకత వస్తుందని, నాణ్యమైన మద్యం లభిస్తుంది 63శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్నఈ కామర్స్‌ యాప్‌ల ద్వారానే హోండెలివరీ చేస్తే బాగుంటుందని 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. కల్తీని అరికట్టవచ్చునని 37 శాతం మంది చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం హోం డెలివిరీ చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో భౌతిక దూరం సమస్య కూడా తొలిగిపోతుంది.

First published:

Tags: Home delivery, Hyderabad, Liquor, Wine shops

ఉత్తమ కథలు