హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : 17లక్షలు చెల్లిస్తేనే చికిత్స లేదంటే డిశ్చార్జ్..కార్పొరేట్ ఆసుపత్రిపై రోగి బంధువులు ఆగ్రహం

Hyderabad : 17లక్షలు చెల్లిస్తేనే చికిత్స లేదంటే డిశ్చార్జ్..కార్పొరేట్ ఆసుపత్రిపై రోగి బంధువులు ఆగ్రహం

HYDERABAD NEWS

HYDERABAD NEWS

Hyderabad:హైదరాబాద్‌లో ఓ పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి రోగి పట్ల అమానవీకంగా ప్రవర్తిస్తోందని బంధువులు ఆందోళనకు దిగారు. క్యాన్సర్ వ్యాధితో పేషెంట్‌ని ఆసుపత్రిలో చేర్పిస్తే ట్రీట్‌మెంట్‌కి రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పి 17లక్షలు బిల్ వేయడంతో బంధువులు షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో ఓ పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రి రోగి పట్ల అమానవీకంగా ప్రవర్తిస్తోందని బంధువులు ఆందోళనకు దిగారు. క్యాన్సర్ వ్యాధితో పేషెంట్‌(Cancer Patient)ని ఆసుపత్రిలో చేర్పిస్తే ట్రీట్‌మెంట్‌(Treatment)కి రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పి 17లక్షలు బిల్ వేయడంతో బంధువులు షాక్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే ..డబ్బులు చెల్లిస్తేనే రోగికి తదుపరి ట్రీట్‌మెంట్ చేస్తామంటున్నారు. అంత డబ్బు లేదని కనీసం డిశ్చార్చ్ (Discharge)చేయమంటే వినిపించుకోకుండా వేధిస్తున్నారని రోగి కుటుంబ సభ్యులు కార్పొరేట్ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు.

Telangana : అక్కడ కాపురాలు కూల్చుకునే దంపతుల సంఖ్యే ఎక్కువ .. ఎందుకో ..? ఎక్కడో తెలుసా..?

రోగి బంధువుల ఆవేదన..

శాంతమ్మ అనే మహిళ క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు ఆగస్ట్ 24న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. ముందుగా రెండున్నర లక్షలు చెల్లిస్తే వైద్యం చేస్తామని చెప్పిన యాజమాన్యం సర్జరీ చేశారు. సాధారణ వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే నాలుగు రోజుల తర్వాత శాంతమ్మకు సర్జరీ చేసిన కుట్ల ఊడిపోయి పేగుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. అదే శరీరం అంతా వ్యాపించడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆసుపత్రి వైద్యులు రెండో సారి సర్జరీ కోసం ఐసీయూకి తరలించి సర్జరీ చేసి 12రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. టెస్టులు, ట్రీట్‌మెంట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని రోగి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేట్ ఆసుపత్రిలో దారుణం..

సుమారు నెల రోజుల క్రితం రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తే ట్రీట్‌మెంట్ పేరుతో 17లక్షలు బిల్లు వేశారు కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం. ముందుగా చెప్పిన డబ్బులు కాకుండా అదనంగా బిల్లు వేయడంపై రోగి బంధువులు ఆందోళనకు దిగారు. అంత డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని చెప్పడంతో శాంతమ్మకు ట్రీట్‌మెంట్ ఆపేశారు వైద్యులు. అసలే క్యాన్సర్ పేషెంట్ కావడం...వెంట వెంటనే రెండు సార్లు సర్జరీ చేయడంతో రోగి పరిస్థితి విషమంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ యాజమాన్యం కనీసం మానవత్వం చూపించకుండా డబ్బులు చెల్లిస్తూనే డిశ్చార్జ్ చేస్తామంటూ మొండి చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.

HCU | HYDERABAD : హెచ్‌సీయూలో స్టూడెంట్స్ రగడ .. క్యాంపస్‌లో ధర్నాతో టెన్షన్‌ వాతావరణం

రోగి హెల్త్ కండీషన్ సీరియస్..

అటు ఆసుపత్రి యాజమాన్యం, ఇటు రోగి బంధువుల మధ్య హాస్పిటల్ బిల్ వ్యవహారం తేలకపోవడంతో వైద్యులు ట్రీట్‌మెంట్ ఆపేశారు. దీంతో శాంతమ్మ ఆరోగ్యం క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం పేరుతో నెల రోజులుగా తమను నరకయాతన పెడుతున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ పేషెంట్‌కు ఏదైనా జరిగితే ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని లేని పక్షంలో శాంతమ్మను డిశ్చార్జ్ చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hospitals, Hyderabad news

ఉత్తమ కథలు