Home /News /telangana /

HYDERABAD PASSENGERS DOWNLOADING FREE WIFI BASED PORNOGRAPHIC VIDEOS AT SECUNDERABAD RAILWAY STATION SNR

Telangana : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై దుర్వినియోగం .. ఏం చేస్తున్నారంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: రైల్వే స్టేషన్‌లలో ఆ సేవలు దుర్వినియోగం అవుతున్నాయి. రైల్వే అధికారులు కల్పిస్తున్న ఆ ఉచిత సేవను ఆ విధంగా వాడుకుంటూ తప్పు చేస్తున్నారు కొందరు ప్రయాణికులు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనే ఎక్కువగా జరుగుతోందని తేలింది. అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
ప్రయాణికుల సౌకర్యం కోసం ఇండియన్‌ రైల్వే(Indian‌ Railways)అందిస్తున్న సాంకేతిక సౌకర్యం దుర్వినియోగం అవుతోంది. రైల్వే స్టేషన్‌(Railway Station‌)లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రైన్‌ల ఇన్ఫర్మేషన్(Train Information), ఫ్లాట్‌ఫామ్‌ టిటెయిల్స్(Platform Details), ఆన్‌లైన్ టికెట్‌ బుకింగ్(Online Ticket Booking)వంటి ప్రయోజనాలు పొందాలని దేశవ్యాప్తంగా ఉన్న వేలాది రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవ(Free WiFi service)లను అందుబాటులోకి తెచ్చారు రైల్వేశాఖ అధికారులు. ఇది ఒకరకంగా ప్రయాణికులకు మేలు చేసే ఆలోచన కావడంతో దేశ వ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్‌లలో వైఫై సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. రైల్వే ఇన్ఫర్మేషన్ కోసం ఉచిత వైఫై సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌(Secunderabad)రైల్వే స్టేషన్‌(Railway Station)లో ఫ్రీ వైఫై ద్వారా అశ్లీల వీడియోలు(Pornographic videos), పోర్న్‌ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లుగా తేలింది.

ఫ్రీ వైఫైతో ..ఆ వీడియోలు చూస్తున్నారు..
దేశంలోనే ఇండియన్‌ రైల్వే అతి పెద్ద రవాణా సంస్థ. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడం లేదంటే గమ్యస్థానాల నుంచి వేర్వేరు ప్రదేశాలకు తరలిస్తున్న అతి పెద్ద ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ. అలాంటి రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం దేశంలోని సుమారు 6100 రైల్వే స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో తెలుగు రాష్ట్రాలనై ఆంధ్రా, తెలంగాణలో పలు రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వై ఫై సేవలు ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. వీటిని రైల్‌ టెల్‌ నిర్వహిస్తోంది. ఉచిత వై ఫై వాడకం ఏమేరకు ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారనే విషయంపై రైల్ టెల్ అధికారులు ఆరా తీస్తే షాకింగ్‌ న్యూస్ బయటపడింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై ద్వారా 35శాతం మంది అశ్లీల వీడియోలు చూడటం, పోర్న్‌ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లుగా తేలింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తర్వాత స్థానంలో నాంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో కూడా ఇదే తరహాలో ఉచిత వైఫై సేవలు మిస్ యూజ్ అవుతున్నట్లుగా రైల్ టెల్‌ అధికారులు గుర్తించారు.

రైల్వే సేవలు దుర్వినియోగం..
సాధారణంగా కరోనాకు ముందు ఈ ఫ్రీ వైఫై సేవలు దేశ వ్యాప్తంగా ప్రయాణికులకు ఉపయోగకరంగానే ఉండేవి. అయితే స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్‌ సంఖ్య పెరగడంతో రైల్వే స్టేషన్‌లో ఎలాంటి నిఘా, కండీషన్స్ ఉండవనే ఆలోచనతోనే ప్రయాణికుల్లో 35శాతం మంది అశ్లీల వీడియోలు, పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను డౌన్‌ లోడ్ చేసుకుంటున్నట్లుగా తేలింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇలా డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారిలో రైల్వే ప్రయాణికులే ఉన్నారా లేక ఫ్రీ వైఫై కోసం పోకిరీలు, పని, పాట లేని యువకులు దుర్వినియోగం చేస్తున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇంత సీక్రెట్‌ని పసిగట్టిన రైల్‌ టెల్‌ అధికారులు ఫ్రీ వైఫై సేవలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శోధిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Secunderabad railway station, Telangana

తదుపరి వార్తలు