Home /News /telangana /

HYDERABAD PARLIAMENT PRIVILEGE COMMITTEE SERVED NOTICES TO DOPT AND CENTRAL HOME MINISTRY REGARDING BANDI SANJAY ARREST IN KARIMNAGAR PRV

Bandi Sanjay: బండి సంజయ్​ ఫిర్యాదు ఎఫెక్ట్​.. అధికారులు కమిటీ ముందు హాజరయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ, డీవోపీటీలకు పార్లమెంట్ ప్రివిలేజ్​ కమిటీ ఆదేశాలు

బండి సంజయ్ అరెస్ట్ దృశ్యాలు

బండి సంజయ్ అరెస్ట్ దృశ్యాలు

కరీంనగర్​లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Telangana BJP Chief Bandi sanjay)​ అరెస్ట్‌కు సంబంధించి డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల కరీంనగర్​లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Telangana BJP Chief Bandi sanjay)​ అరెస్ట్‌కు సంబంధించి డీవోపీటీ, కేంద్ర హోంశాఖకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ (Parliamentary Privilege Committee) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలలో తెలిపింది. ఐఏఎస్, పోలీసు అధికారులు కమిటీ ఎదుట ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డీవోపీటీ(Dopt), కేంద్ర హోమ్ కార్యదర్శి ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ (Parliamentary Privilege Committee) ఆదేశించింది.

అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌ రవి గుప్తాలతో పాటుగా మరికొందరు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ (privileges committee) జనవరి 22న నోటీసులు పంపింది. బండి సంజయ్‌ (Bandi Sanjay) ఫిర్యాదు మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసుల్లో పేర్కొంది. సీఎస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి‌లతో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. అంతేకాకుండా ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌లకు సైతం కమిటీ నోటీసులు జారీ చేసింది.

ఏం జరిగింది? 

కొంత కాలం క్రితం జీవో 317 కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ శాంతియుత దీక్షను చేపట్టారు. దీంతో సంజయ్ తో పాటు.. బొడిగె శోభ ఇంకొంత మందిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో సీపీ సత్యనారాయణ ఓ కానిస్టేబుల్ నుండి కమిషనర్ దాకా అన్ని ఆయనే చేశారనే ఆరోపణలు ఎదుర్కోన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆయనపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై బీసీ కమీషన్’లో ఫిర్యాదు చేశారు. దీంతో బీసీ కమిషన్​ ముందు సీపీ హాజరయ్యారు.

ఇక కరీంనగర్​ ఎపిసోడ్​పై కేంద్రం సైతం సీరియస్​ అయింది. ఒక ఎంపీ విషయంలో పోలీసులు తీరు సరిగా లేదని తెలంగాణ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్రం హోంశాఖ రంగంలోకి దిగింది. బండి సంజయ్‌పై కరీంనగర్ పోలీస్ కమిషనర్ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. కొన్ని రోజుల కిందట లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చారు.

ప్రివిలేజ్​ కమిటీకి వివరణ..

తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బండి సంజయ్ వివరించారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారని, పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి బండి సంజయ్ వివరించారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని తెలిపారు. సంజయ్ తన వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bandi sanjay, Karimnagar, Parliament

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు