పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) ప్రధాన నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రతి ఏటా సీబీఎస్ఈ పరీక్షలకు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థుల్లో పరీక్ష భయం, ఒత్తిడి పోగొట్టడంతో పాటు వాటిని ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇస్తుంటారు ప్రధాని. ఈ ఏడాది కూడా ఢిల్లీ (New Delhi)లోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ హోస్ట్‌గా జరిగిన పరీక్ష పే చర్చ జరిగింది. ఎంతో మంది విద్యార్థులతో సంభాషించిన ఆయన.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన మార్క్ మెసేజ్‌తో, అద్భుతమైన సూచనలతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర కూడా ప్రధాని మోదీతో మాట్లాడింది. బహు భాషలపై పట్టు సాధించాలంటే ఎలా కష్టపడాలని అడిగింది.
ఆ అమ్మాయి ప్రశ్నకు బదులిస్తూ.. ప్రధాని మోదీ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను వివరించారు. '' రోజు వారీ కూలీలు నివసించే ఓ బస్తీలోని ఒక ఎనిమిదేళ్ల చిన్నారి.. హిందీతో పాటు తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ మాట్లాడటం నన్ను ఆశ్చర్యపర్చింది. అసలు ఆ బాలిక అన్ని భాషలు మాట్లాడగలుగుతుందని ఆరా తీశాను. ఆ చిన్నారి ఇంటి పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు. బతుకు దెరువు కోసం వలస వచ్చిన వారంతా ఒక ఒక దగ్గర నివసించడంతో .. వారితో ఆ బాలిక నిత్యం మాట్లాడుతుండేది. అలా ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు.'' అని సమాధానం చెప్పారు ప్రధాని మోదీ.
ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం 38 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన సందేహాలను మోదీ నివృత్తి చేశారు. ఏటా సీబీఎస్ఈ పరీక్షలకు ముందు మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో ఆన్సర్లు ఇస్తుంటారు మోదీ. ఆయన ఇచ్చే సలహాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిఏడాది లాగే ఈసారి కూడా ఎగ్జామ్స్‌కి జీవితాన్ని లింక్ చేస్తూ విలువైన సూచనలిచ్చారు మోదీ. అందులో షార్ట్‌కట్స్ వద్దంటూ ఆయన చెప్పిన మెసేజ్ విద్యార్థులను కట్టిపడేసింది.
స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్‌లో ఏదీ ఇంపార్టెంట్ అంటూ ఓ విద్యార్థి మోదీని ప్రశ్నించాడు. దీనికి మోదీని ఇచ్చిన సమాధానంతో కార్యక్రమ ప్రాంగణం చప్పట్లతో మోరుమోగిపోయింది. కొంతమంది తెలివితో వర్క్ చేస్తారని.. మరికొంతమంది తెలివిగా కష్టపడతారన్నారు మోదీ. అయితే కొంత మంది విద్యార్థులు వారి సృజనాత్మకతను పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారని... ఆ తెలివిని మంచి మార్గానికి వాడుకుంటే జీవితంలో విజయాలు సాధిస్తామన్నారు. జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్స్ వెతుక్కోకూడదంటూ మంచి మెసేజ్ ఇచ్చారు మోదీ. మొబైల్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్లను పదేపదే వాడే అలవాటును తగ్గించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. వచ్చే నెల 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana