Home /News /telangana /

Don't give bike: ఇతరులకు బైక్ ఇస్తున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి.. లేదంటే జైలులో చిప్పకూడే.. అదెలాగో తెలుసుకోండి..

Don't give bike: ఇతరులకు బైక్ ఇస్తున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి.. లేదంటే జైలులో చిప్పకూడే.. అదెలాగో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Don't give bike: రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ కొని ఒకరు మృతి చెందారు. సంఘటనా స్థలంలో ఇద్దరే ఉన్నారు. ఒకరు నిందితుడు. మరొకరు ప్రమాదానికి గురై మరణించిన వ్యక్తి కానీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఒక్క ప్రమాదంలో ఓ మనిషి ప్రాణాలు కోల్పోగా ముగ్గురు కటకటాలపాలయ్యారు.

ఇంకా చదవండి ...
    అర్జెంట్ గా బయట పని ఉంది.. ఒక్కసారి బైక్ ఇస్తే ఇలా వెళ్లి వస్తాను అని చెప్పి మీ వద్ద ఎవరైనా బైక్ అడుగుతున్నారా.. అయితే ఆగండి.. ఒక్కసారి ఆలోచించుకోండి. బంధువు అనో.. స్నేహితుడు అనో మీరు బైక్ ఇస్తే కటకటాల పాలు అవ్వడం ఖాయం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, మైనర్లకు, మద్యం మత్తులో ఉన్నవారికి బైక్‌ లేదా ఇతర వాహనాలు ఇవ్వడం నేరమని పోలీసులు ఎంత చెప్పినా జనాల్లో మార్పులు రావడం లేదు. ఇటీవల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. వాహనాదారులపై కేసులు నమోదు చేస్తున్నా వాహనదారులు మారడం లేదు. అలాంటి వారిని జైలుకి కూడా పంపిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇతరులకు బైక్ ఇచ్చిన పాపానికి ఇద్దరు యజమానులు కటకటాల పాలయ్యారు. మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గురిని జైలు పాలు చేసింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మరణించగా అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. అతడికి బైక్ ఇచ్చినందుకు సదరు వ్యక్తిని కడా అరెస్టు చేశారు. ఈ రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొడ్డునాంపల్లి గ్రామంలో మాచారం సాయికుమార్‌ అనే వ్యక్తి బైక్ నడుపుకుంటూ రోడ్డుపై వెళ్తున్నాడు. అప్పడికే మద్యం తాగిన ఇతడు ఎదురుగా వస్తున్న బైక్ ని మద్యం మత్తులో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అవతల వైపు బైక్ నడుపుతున్న గుండోల ప్రశాంత్‌ అక్కడిక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సాయికుమార్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తనుకు బైక్ సభావత్ ఇచ్చినట్లుగా తెలిపాడు. సబావత్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరణించిన ప్రశాంత్ కు టూ వీలర్ లైసెన్స్ లేనట్లు గుర్తించారు.

    లైసెన్స్ లేకున్నా వాహనం ఇచ్చినందుకు యజమాని బైండ్ల శ్రీనివాసుపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఇరు వాహనాల యజమానులను 304 పార్ట్‌ -2 కింద పోలీసులు అరెస్టు చేశారు. నేరం నిర్ధారణ అయితే నిందితులకు పదేళ్ల జైలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. ఇలా తమ వాహనాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని.. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిక, మద్యం తాగినవారికి, మైనర్లకు అస్సలు ఇవ్వకూడదన్నారు. ఒక్కసారి పట్టుడడిన తర్వాత మాకు సంబంధం లేదంటే కుదరదని పోలీసులు హెచ్ఛరిస్తున్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Veera Babu
    First published:

    Tags: Accident, Bike accident, Crime, Crime news, Fine, Hyderabad Traffic Police, Jail, Ranga reddy, Road Accident, Telangan traffic police, Telangana, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు