HYDERABAD OWNER OF THESE CARS WILL NOT HAVE POLLUTION CERTIFICATE NO FINE HERE IS THE FULL DETAILS VB
Pollution Certificate: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Good News: వాహనదారులు కచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఇది లేదంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘటనకు ఫైన్ తో పాటు.. అతడికి శక్షకూడా అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పే కొన్ని వాహనాలకు మాత్రం పొల్యూషన్ సర్టిపికేట్ అవసరం ఉండదు. అవేంటో తెలుసుకుందాం..
దేశంలో వాయుకాలుష్యం(Air Pollution) విపరీతంగా పెరిగిపోతోంది. లాక్ డౌన్(Lock down) సమయంలో వాయు కాలుష్యంపై వివరణ ఇచ్చిన అధికారులు.. వాహనాల రాకపోకలు లేనందును కాలుష్యం(Pollution) భారీగా తగ్గిందని చెప్పారు. అంటే వాహనాల ద్వారా వచ్చే పొగ కారణంగా వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందనేది అర్థం అవుతోంది. మొన్న దీపావళి(Diwali) పండగ తర్వాత ఇక దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయుకాలుష్యం కారణంగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీని యొక్క ప్రభావం గొంతుమంట, కళ్లల్లో నుంచి నీళ్లు కారడం లాంటివి వస్తుంటాయి. దీనిపై సుప్రింకోర్టు కలగజేసుకొని.. వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఉపయోగం లేకుండా ఉన్న పవర్ ప్లాంట్లను నిలిపివేయడం.. రవాణా, అనవసరమైన నిర్మాణాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక వాయు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వాహనాలు పొల్యూషన్ సర్టిఫికేట్ (Pollution Under Control Certificate) విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది. ఇక ఏ వాహనదారుడు అయినా.. వాహనానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లను కలిగి ఉండాలి. పొల్యూషన్, ఇన్సురెన్స్ లాంటి డాక్యూ మెంట్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే.. జరిమానాతో పాటు..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకు విధించే మరికొన్ని శిక్షలు ఉంటాయి.
ఇక పొల్యూషన్ సర్టిఫికెట్ విషయానికి వస్తే.. వాహనదారినికి ఈ సర్టిఫికేట్ లేకపోతే.. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10వేలు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. PUC (Pollution Under Control Certificate) సర్టిఫికేట్ కాలుష్య పరీక్షలకు సంబంధించినది. దీనిలో వాహనం నుంచి ఎంత కాలుష్యం విడుదల అవుతుందనే వివరాలు అందులో ఉంటాయి. దీనిని ఆరు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సి ఉంటుంది. గడవు తీరిన సర్టిఫికేట్ తో పోలీసులకు పట్టుబడితే అంతే ఇక. ఈ సర్టిఫికేట్ అనేది డీజిల్, పెట్రోల్ తో నడిచే టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు తప్పనిసరి. ఇది దేశ వ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.
ఈ టెస్టింగ్ సెంటర్లు ఆయా పట్టణాల్లో అందుబాటులో ఉంటాయి. లేదా పెట్రోల్ బంకు దగ్గర కూడా ఉంటాయి. అధికారులు ఇక్కడ చెప్పే వాహనాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అందులో బ్యాటరీతో నడిచే కారు, ద్విచక్ర వాహనాలు, ఈ-రిక్షా లేదా, ఈ-స్కూటీని కలిగి ఉన్నట్లయితే పీయూసీ సర్టిఫికేట్ అవసరం ఉండదు. ఈ వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్ అడగరు. కేవలం పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలకు మాత్రం అవసరం అని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.