హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR | Hyderabad : అనాధ యువతికి అన్నగా మారి మంత్రి .. చదువుల సరస్వతికి కేటీఆర్ ఆర్ధిక సాయం

KTR | Hyderabad : అనాధ యువతికి అన్నగా మారి మంత్రి .. చదువుల సరస్వతికి కేటీఆర్ ఆర్ధిక సాయం

KTR help orphan girl

KTR help orphan girl

KTR | HYDERABAD: నిరుపేద విద్యార్ధిని రుద్ర రచన అనే అమ్మాయి తల్లిదండ్రుల్ని కోల్పోయింది. హైదరాబాద్‌లోనే ఇంజనీరింగ్ చదువుతున్న మెరిట్ స్టూడెంట్‌కి ఫీజుల విషయంలో ఆర్ధికంగా ఆదుకొని ఆమె అభివృద్ధికి బాట వేశారు మంత్రి కేటీఆర్. అందుకు కృతజ్ఞతగా ఏం చేసిందో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అన్నీ దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని పెద్దలంటారు. ఎందుకంటే అత్యున్నత శిఖరాలకు చేర్చేది విద్య ఒక్కటే కాబట్టి. విద్య ఒక్కటి వస్తే చాలు ఎవరిపైన ఆధారపడకుండా జీవించవచ్చని ఎందరో నిరూపించారు. జగిత్యాల(Jagityal) జిల్లాకు చెందిన నిరుపేద విద్యార్ధిని రుద్ర రచన (Rudra Rachana)అనే అమ్మాయి తల్లిదండ్రుల్ని కోల్పోయింది. హైదరాబాద్‌(Hyderabad)లోనే ఇంజనీరింగ్ (Engineering)చదువుతున్న మెరిట్ స్టూడెంట్‌కి ఫీజుల విషయంలో ఆర్ధికంగా ఆదుకొని ఆమె అభివృద్ధికి బాట వేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(ktr). తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తనకు అండగా, సొంత అన్నగా సాయం చేసిన మంత్రిని కలిసి తనకు చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా తోబుట్టువుగా రాఖీ కట్టి సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Sad news : కూల్‌ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకున్నందుకు ఐదేళ్ల చిన్నారికి ఎంత శిక్ష పడిందో తెలుసా..?

చదువుల సరస్వతికి సాయం ..

సమస్యలు అందరికి ఒకే విధంగా ఉండవు. కొందరికి ఆరోగ్య సమస్య, మరికొందరికి ఆర్ధిక బాధలు..ఇంకొందరికి అవయవలోపాలు ఇలా సమాజంలో ఉండే చాలా మంది తమకున్న సమస్యలతో కుంగిపోతూ ఉంటారు. కాని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. ఏనాడు తాను ఒంటరిని అనే అనుకోలేదు. స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్ ని పూర్తి చేసింది.ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సిబిఐటి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది.

అన్నగా మారిన మంత్రి రామన్న..

ముళ్ల బాటగా ఉన్న రచన జీవితంలో ఒక్కో అడుగు ముందుకేస్తూ వచ్చింది. అయితే ఇంజనీరింగ్ ఫీజు చెల్లించే విషయంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ 2019లో రచనను ప్రగతిభవన్‌కి పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు మరియు హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్ధిక సహాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది.

Hyderabad : ఈ నగరానికి ఏమైంది.. లాడ్జిలా? డెన్ లా?.. వారం రోజుల్లో ఆడపిల్లలపై ఇన్ని దారుణాలా?

రాఖీ కట్టిన రచన..

తన జీవితానికి ఓ గమ్యాన్ని చూపించిన మంత్రి కేటీఆర్‌ చేసిన సహాయాన్ని మర్చిపోని రచన మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌కు వెళ్లి మరీ కలిసింది. రచన చదువు, ప్రస్తుతం సాధించిన ఉద్యోగాల వివరాలను మంత్రితో చెప్పడంతో ఆయన అభినందించారు. అనాధగా ఉన్న అమ్మాయి విద్యలో రాణించి ఉద్యోగం సంపాధించినంందుకు మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు ఓ అన్నగా అండగా నిలిచారంటూ రచన భావోద్వేగానికి లోనైంది. మంత్రి కేటీఆర్‌కి ఈసారి రాఖీ కట్టాలనుకున్న విషయాన్ని మంత్రికి చెప్పింది. తాను కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బుతో తయారు చేయించిన వెండి రాఖీని మంత్రి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్చింది రచన.

స్ధిరపడే వరకు అండగా ఉంటానని హామీ ..

జీవితంలో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి ఎదిగిన రచనను చూసి కేటీఆర్ సంతోష పడ్డారు. జీవితంలో మరింత స్థిరపడే వరకూ తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. నాలుగు కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన రచన యువతరానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి సివిల్ సర్వెంట్ కావాలన్నా తన లక్ష్యానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రచన చివరి సంవత్సరం ఇంజినీరింగ్ ఫీజు, హాస్టల్ బకాయిలను కొరకు అవసరం అయినా మొత్తం నగదు సహాయాన్ని సోమవారం రచనకు అందజేశారు కేటీఆర్.

Published by:Siva Nanduri
First published:

Tags: Minister ktr, Telangana News

ఉత్తమ కథలు