Home /News /telangana /

HYDERABAD ORGANIZERS PREPARING TEMPLES FOR ASHADAM BONALU CELEBRATIONS IN TELANGANA VB

Hyderabad: బోనాలకు భాగ్యనగరం ముస్తాబు.. షురూ అయిన బోనాల సందడి.. దేవాలయాలను తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు..

బోనాలతో మహిళలు (ఫైల్)

బోనాలతో మహిళలు (ఫైల్)

Hyderabad: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల జాతర సందడి నగరంలో షురూ అయ్యింది. బోనాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. బోనాల జాతర కోసం నగరంలోని అమ్మవారి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

    బోనాల జాతర అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్ లష్కర్ బోనాలు. ప్రతీ ఆషాడమాసంలో నిర్వహించే ఈ బోనాల పండగకు ఎక్కడ లేని గుర్తింపు ఉంది. మొదటగా నగరంలో గోల్కండ బోనాలతో మొదలయి ఓల్డ్ సిటీలో రంగం కార్యక్రమం తర్వాత ఉమ్మడి దేవతల ఊరేగింపు జరగనుంది. బోనాల జాతర కోసం నగరంలోని అమ్మవారి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో హైదరాబాద్ లో బోనాల సందడి ఇప్పటి నుంచే షురూ అయింది. 11వ తేదీన గోల్కొండ బోనాలు, 25వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు, ఆగస్టు 2న ఓల్డ్ సిటీలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఉమ్మడి దేవతల ఊరేగింపు జరుగనుంది. ఈసారి ఆషాడ బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

    ఫైల్ ఫోటో: భాగ్యనగరంలో బోనాలు ఉత్సవాల సందడి
    ఫైల్ ఫోటో: భాగ్యనగరంలో బోనాలు ఉత్సవాల సందడి


    బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.15కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Bonalu, Festival, Hindu Temples, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు