బిగ్ డీల్. ల్యాండ్ సెటిల్‌మెంట్(Land settlement)వ్యవహారం. సిటీకి దూరంగా మూడెకరాల స్తలాన్ని పార్టనర్‌షిప్‌లో కొనుగోలు చేశారు. అందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్న భూమిని ఒకే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ (Registration)చేయడం..అతను మాట మార్చడంతో అసలు వివాదం మొదలైంది. పలుమార్లు చర్చలతో సర్ధుకుపోయారు. కాని ఆదివారం (Sunday) రాత్రి మాత్రం ఏకంగా కాల్పులు(Firing) జరుపుకునే వరకు వచ్చారు. ఈ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో ఒకరు తుపాకీ (Gun)తూటాలకు బలైపోగా...మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అర్ధరాత్రి కాల్పుల కలకలం..
ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో పోలీస్ పెట్రోలింగ్, జనసామర్ధ్యం ఉండే మాదాపూర్‌లో తుపాకీ కాల్పుల మోతతో మృతుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌తో పాటు అతని స్నేహితులు కలిసి సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ దగ్గర మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం ఆ భూమిని నిందితుడు జిలానీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు ఇస్మాయిల్. భూమి విషయంలో తర్వాత గొడవపడుతూ వచ్చారు. అదే క్రమంలో జిలానీ మాట మార్చడంతో ఎవరికి వారు ఈ వ్యవహారాన్ని తెగ గొట్టుకోవాలని చూస్తూ వచ్చారు. అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్, అతని స్నేహితుడు మహ్మద్ ముజాహిద్ ఆదివారం మాదాపూర్‌లోని నీరూస్ సెంటర్ దగ్గరలోని ఓ ఇడ్లీ బండి దగ్గర సెటిల్‌మెంట్ కుదుర్చుకున్నట్లుగా మృతుని స్నేహితుడు సయ్యద్ ఫయాజ్ తెలిపాడు. ఈ వ్యవహారంలో చనిపోయిన ఇస్మాయిన్ అతని స్నేహితులకు 20లక్షల రూపాయలు ఇస్తామని జిలానీ పిలిపించారు.
ల్యాండ్ సెటిల్‌మెంట్ పేరుతో మర్డర్ స్కెచ్..
ల్యాండ్ సెటిల్‌మెంట్ కోసం మృతుడు ఇస్మాయిల్‌తో పాటు అక్రం, గౌస్, జహంగీర్ నలుగురు ఉన్నారు. మహ్మద్ ముజాహిద్‌తో పాటు మరో ఇద్దరు కారులో వచ్చారు. డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య మాటమాట పెరగడంతో జిలానీ తన జేబులోంచి కంట్రీ మేడ్ తుపాకీతో ముందుగా ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపినట్లుగా స్పాట్‌లో ఉన్న జహంగీర్ తెలిపాడు. అటుపై జిలానీ వెంట వచ్చిన మరో ఇద్దరూ కాల్పులు జరిపారు. మొత్తం ఐదారు రౌండ్లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ తల వెనుకభాగంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అడ్డుకోబోయిన జహంగీర్‌పై కూడా బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. ఇస్మాయిల్‌కి తీవ్రంగా బుల్లెట్ గాయాలవడంతో వెంటనే కారులో ఎక్కించి మిత్రులు ఉస్మానియాకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడు. బుల్లెట్ తగిలి గాయపడిన జహంగీర్‌కి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. చనిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్, మహ్మద్ ముజాహిద్‌కు జైల్లోనే పరిచయం ఉన్నట్లుగా..ఇద్దరిపై రౌడీషీట్ కూడా నమోదైనట్లుగా తేలింది.
Telangana | Rythu Bima : ఆ డబ్బు కోసం కక్కూర్తి పడిన కొడుకు .. తల్లి పేరుతోనే ప్రభుత్వానికి టోకరా
నిందితుల కోసం గాలింపు..
సిటీలో కలకలం రేపిన ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో ఒకరు చనిపోవడం..మరోకరు గాయపడటంతో బాలానగర్ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ని రంగంలోకి దింపారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోయిన జిలానీ అతని స్నేహితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని బాలానగర్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Telangana News