HYDERABAD OLD AGE MAN MISBEHAVES A MINOR GIRL IN KHAMMAM VRY
Khammam : పండ్లు కొనుక్కోవడానికి వస్తే , మైనర్ బాలికను గట్టిగా పట్టుకున్నాడు..
ప్రతీకాత్మక చిత్రం
Khammam : పదేళ్ల బాలికపై 55 సంవత్సరాల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తన వద్దకు పండ్లు కొనుకొలు చేసేందుకు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకోవడంతో గట్టిగా అరిచి ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.
టేకులపల్లి పరిధి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంగణం సమీపంలో ఓ వృద్ధుడు ఐదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల బాలిక తన తమ్ముడితో కలిసి గురువారం ఇళ్ల సమీపంలో రేగిపండ్ల కోసం వెళ్లగా అరటిపండ్లు విక్రయించే 53ఏళ్ల వీరమల్ల వెంకన్న ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
గట్టిగా కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో బాలికను వదిలేయడంతో పరుగున ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి స్థానికులతో కలిసి అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కోట్టారు.. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఖానాపురం హవేలీ పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులు దొంగలుగా మారారు.. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు.
అయితే తెల్లరంగు బైకు రింగు వాళ్లను పోలీసులకు పట్టించింది. కాగా మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.