అన్ని ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడు ఏం కొనే పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోల్ ధర వంద ఎప్పుడో దాటేసింద. గ్యాస్ సిలిండర్ ధర కూడా వెయ్యి రూపాయలకు పైగానే ఉంది. అయితే వాహనదారులకు తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ఆశాభావాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వ్యక్తం చేశారు.
గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చూడగా, అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి ఇప్పుడు లాభాలను చూస్తున్నాయి. అదే సమయంలో డీజిల్‌పై అవి ఇప్పటికీ కూడా నష్టపోతున్నాయి. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు. ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని మంత్రి హరిదీప్ సింగ్ పూరి తెలిపారు.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 100.66గా ఉంది. గత రెండు వారాలుగా ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు డీజిల్ ధర కూడా పెరుగుతూనే ఉంది. డీజిల్ ధర లీటర్‌కు రూ. 97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72గా ఉంది. డీజిల్ ధర రూ89. 62 గా ఉంది. తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి ఈ ధరలు తగ్గుతాయని చెప్పడంతో ...వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Petrol Price