హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG:హైదరాబాద్ మహిళలకి ఎంత కష్టం వచ్చింది.. ఏకంగా 51 శాతం మంది..

OMG:హైదరాబాద్ మహిళలకి ఎంత కష్టం వచ్చింది.. ఏకంగా 51 శాతం మంది..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Hyderabad:హైదరాబాద్‌లో ఉండే మహిళలు ఇప్పటికైనా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శరీరంలో కొవ్వు, బరువు పెరగడం మొదలుపెడితే తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ లెక్కలు చూపిస్తున్నాయి. కేవలం భాగ్యనగరంలో ఉండే వాళ్లు మరింత కేర్ తీసుకోవాల్సిన టైమ్‌ ఇది.

ఇంకా చదవండి ...

మోడ్రన్ డ్రెస్సులు, జీన్స్‌ వేసుకొని ఎవరికి వాళ్లు సన్నగా ఉన్నామనుకుంటున్నారు అంతే కాని. శరీరంలో పెరుగుతున్న కొవ్వును మాత్రం లెక్కబెట్టడం లేదు. అందుకే రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ల హెల్త్ అండ్ బాడీ ఫిట్‌నెస్ గురించిన జరిపిన అద్యాయనంలో షాక్‌ అయ్యే విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ (Hyderabad)లో ఉండే మహిళలు, ఆడవాళ్ల గురించి చెప్పాల్సి వస్తే ఏంటీ వీళ్లకింత కష్టం వచ్చిందని జాలిపడాల్సిన సిస్ట్యూవేషన్ నెలకొంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే మహిళల శరీరాల్లో పేరుకుపోతున్న కొవ్వు, అనసవరమైన శరీరపు బరువులు పెరిగి ఊబకాయం(Obesity)తో అవస్థలు పడుతున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. జంటనగరాల పరిధిలో ఉండే మహిళల్లో 51శాతం(51 Percent) మంది ఈ అధిక బరువు, ఊబకాయం వంటి కనిపించని అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ (Council for Social Development)జరిపిన అధ్యాయనంలో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 30.1శాతం ఉన్నట్లు కౌన్సిల్ నివేదిక చూపిస్తోంది. కౌన్సిల్ 2019-20 మధ్య కాలంలో సేకరించిన వివరాలను బట్టి చూస్తే అప్పట్లో కాస్త తక్కువగానే ఉన్నప్పటికి ప్రస్తుతం మాత్రం హైదరాబాద్‌లో ఉండే సగానికిపైగా ఆడవాళ్లు శరీర కొలతలు, బరువు, పరిమాణం ప్రకారం ఉండాల్సిన బరువు కంటే అధికంగా పెరిగి ఇబ్బందులు పడుతున్నట్లుగా తేలింది.

ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు..

తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏ ఏ జిల్లాల్లో ఎంత మందిని ఇలాంటి సమస్య వేధిస్తుందనే విషయాన్ని కౌన్సిల్ సేకరించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఉండే మహిళల్లో 51శాతం మందిలో ఈ ఊబకాయ సమస్య వేధిస్తుండగా అతి తక్కువగా కుమురంభీమ్‌ ఆసిఫాబాద్ జిల్లా 14శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

వణుకుపుట్టిస్తున్న ఒబెసిటీ..

ముఖ్యంగా రాష్ట్రంలోని 18.8 శాతం మంది మహిళలు తమ BMI సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 12.4 శాతం తో అతి తక్కువ బీఎంఐ సాధారణం కంటే తక్కువగా ఉండగా..జోగులాంబ గద్వాల్‌లో 27.5 శాతంతో అత్యధిక శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం చెబుతున్న వివరాలను బట్టి చూస్తే హైదరాబాద్‌లో ఉంటున్న మహిళలు కంటికి కనిపిస్తున్న ఊబకాయం అనే శత్రువుతో పోరాడుతున్నారని తేలిపోయింది.

Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, VIRAL NEWS

ఉత్తమ కథలు