Home /News /telangana /

HYDERABAD NSUI LEADERS BESIEGED OU FOR NOT ALLOWING RAHUL GANDHI TO VISIT OSMANIA UNIVERSITY AND POLICE ARRESTED THEM PRV

Osmania University: ఎన్​ఎస్​యూఐ ఓయూ ముట్టడి.. మహిళా పోలీసుల పట్ల అసభ్య ప్రవర్తన.. జగ్గారెడ్డి అరెస్టు..

ఓయూ వద్ద విద్యార్థి నేత

ఓయూ వద్ద విద్యార్థి నేత

ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్​గాంధీ వెళ్లాలనుకున్నారు. అయితే ఓయూకి వెళ్లడానికి అనుమతి లభించలేదు. దీంతో  కాంగ్రెస్​ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులు ముట్టడించారు.

  తెలంగాణ (Telangana)లో రాహుల్‌గాంధీ (Congress leader rahul gandhi) పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాహుల్ టూర్ మొదలవుతుంది. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించున్నారు. సభ తర్వాత రోడ్డు మార్గాన రాహుల్ హైదరాబాద్‌ (Hyderabad) రానున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్​గాంధీ వెళ్లాలనుకున్నారు. అయితే ఓయూకి వెళ్లడానికి అనుమతి లభించలేదు (Permission Declined). దీంతో  కాంగ్రెస్​ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania university) ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్ఎస్‌యూఐ (NSUI) విద్యార్ధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టించారు .

  మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా..

  కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ సభకు (rahul gandhi) అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా వర్సిటీ గేట్లు ఎక్కి విద్యార్ధులు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలు ధ్వంసం చేశారు . ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు . అయితే మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్‌ (venkat balmoor) , సహా కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్ధులను కలిసేందుకు జగ్గారెడ్డి వారిని కలిసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో వున్న జగ్గారెడ్డిని (jaggareddy కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ (madhu yashki) , గీతారెడ్డి (geetha reddy) ) పరామర్శించారు . అలాగే ఎన్‌ఎస్‌యూఐ విద్యార్ధి సంఘాల నేతలతోనూ మాట్లాడారు.

  సీఎం కేసీఆర్‌కు ఎందుకు భయమని..

  రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకు భయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ సభను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రాహుల్‌గాంధీ ఓయూ సమావేశానికి అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, వీహెచ్‌ ఓయూ వీసీ అనుమతి కోరారని, కానీ పర్మిషన్ ఇవ్వలేదన్నారు. రాహుల్‌గాంధీపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తాను స్పందించన్నాుర. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

  మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (hanumantha rao)  అంబర్ పేట్ పీఎస్‌కు వెళ్లారు. అయితే పోలీసులు స్టేషన్‌లోకి వీహెచ్‌ను అనుమతించలేదు . ఓయూలో అరెస్ట్ అయిన విద్యార్ధులను పరామర్శించేందుకు వీహెచ్ వెళ్లారు. తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసేందుకు వీహెచ్ వెళ్లారు. జగ్గారెడ్డి, ఎన్ఎస్‌యూఐ నేత వెంకట్ బల్మూర్‌ అరెస్ట్‌లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) ఖండించారు . పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామకమని.. పోలీసులు నేతల కోసం కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతివ్వకపోవటం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీ కుటుంబానికి.. ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవమని విక్రమార్క ధ్వజమెత్తారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Osmania University, TS Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు