హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు -ఫోన్ చేస్తే చాలు -Dussehra 2021 వేళ ఎండీ Sajjanar ఇలా..

TSRTC: ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు -ఫోన్ చేస్తే చాలు -Dussehra 2021 వేళ ఎండీ Sajjanar ఇలా..

టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC bus services at passenger doorstep : దసరా పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవల్ని తీసుకొచ్చింది. ప్రయాణికులు కోరితే వారి ఇళ్లు లేదా కాలనీల వద్దకే సర్వీసును పంపుతామని సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారి కోసం సంస్థ ఫోన్ నంబర్లను విడుదల చేసింది..

ఇంకా చదవండి ...

తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (ts rtc) ప్రయాణికుల కోసం మరిన్ని సేవలను విస్తరించింది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలలా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. ప్యాసింజర్లను ఆకట్టుకునేలా మరో చర్యకు పూనుకుంది. ప్రయాణికులు కోరుకుంటే వారి ఇళ్ల వద్దకే బస్సును పంపుతామని సంస్థ ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని డిపోలు ‘ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు’ ప్రకటనను ప్రచారం చేస్తున్నాయి..

దసరా పండుగ సందర్భంగా ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ఆర్టీసీ సంస్థ 4వేల పైచిలుకు స్పెషల్ బస్సులను నడుపనుంది. పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి లక్షల మంది ప్రజలు సొంత ఊళ్లకు ప్రయాణాలు చేయనున్న దరిమిలా వారి కోసం ఆర్టీసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వ్యక్తులుగా కాకుండా పెద్ద కుటుంబంగా లేదా బంధుగణమంతా ఒకే సారి ఊళ్లకు ప్రయాణం చేయాలనుకుంటే.. మన ఇంటి వద్దకే బస్సును పిలిపించుకోవచ్చు..

ఒకేచోట నుంచి 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు మరో ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. ఆర్టీసీ బస్సు వారి ఇంటి దగ్గరికి లేదా చెప్పిన చోటికి వెళ్లి పికప్ చేసుకుంటుంది. ప్రస్తుతానికి దసరా నేపథ్యంలో ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఈ సౌర్యం అందుబాటులోకి రానుంది. కుటుంబాలతో ప్రయాణాలు చేయాలనుకునేవారు, వలస కూలీల బృందాలు, విద్యార్థులు.. ఇలా చాలా మందికి ఈ (ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు) సేవలు తోడ్పడతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ బస్సును ఇంటి వద్దకే రప్పించుకోడానికి ప్రయాణికులు చేయాల్సిందల్లా సంబంధిత నంబర్లకు ఫోన్ చేయడమే. ప్రయాణానికి 24 గంటల ముందు వివరాలు చెబితే మనం కోరిన చోటికే బస్సును పంపుతారు. హైదరాబాద్ లో ఈ సేవలకు సంబంధించి ఎంజీబీఎస్, కోఠి, రేతిఫైల్ బస్టాండ్ల ఫోన్ నంబర్లను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే గనుక రాబోయే దీపావళి, న్యూఇయర్, సంక్రాంతి సీజన్లకు కూడా ఇంటి వద్దకే బస్సు సౌకర్యాన్ని కొనసాగించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నట్లు తెలిసింది.

ఇక, దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ సమాయత్తమవుతున్నది. ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ స్పెషల్‌ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ల ద్వారా ఈ బస్సులను నడిపేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం 4035 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ వి.వరప్రసాద్‌ తెలిపారు.

First published:

Tags: Bus services, Sajjanar, Telangana, Tsrtc

ఉత్తమ కథలు