HYDERABAD NO LOCKDOWN IN TELANGANA AND THERE IS NO INTENTION TO THE STATE MEDICAL AND HEALTH DEPARTMENT VS
No Lockdown : లాక్డౌన్ పై తేల్చి చెప్పిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే అవకాశం లేదు..వైద్య ఆరోగ్య శాఖ
Lockdown : తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలను వైద్య ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రభుత్వానికి తమ శాఖ తరఫు నుండి ఎలాంటీ నివేదికలు పంపలేదని ఆ శాక డైరక్టర్ డా.శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారంటూ పలు మీడీయా సంస్థలతో పాటు,సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.,,ఏప్రిల్ 2 రెండున మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుందని , అందుకే రాత్రీపూట కర్య్యూను విధించారని చెబుతున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వార్తలు వెలువడుతున్నాయి..అయితే అవన్ని నిజం కాదని వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ డా. శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ తరుఫున ఎలాంటీ నివేదికలు పంపలేదని ఆయన తెలిపారు. కాగా అంతకు ముందే మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ కరోనా పెరుగుదల స్థిరంగా ఉందని చెప్పారు. ప్రజలు మరో నాలుగు వారాలు సంయమనం పాటిస్తే కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించడం వల్లే కరోనాను ఎదుర్కోగలమని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే గత కొద్ది రోజులుగా లాక్డౌన్ విధిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియనుండడంతో పాటు ప్రధాని మోడీ ముందే రాష్ట్రాలకు ఇండికేషన్ ఇచ్చారనే వార్తలు వెలువడ్డాయి. మరోవైపు లాక్డౌన్ అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని కూడ కేంద్రం స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రంలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది..కరోనా తీవ్ర పరిస్థితిలో ఉన్నా...రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా లాక్డౌన్ విధించడం లేదని ..ఈనెల ముప్పైన ఎన్నికలు ముగియనుండడంతో పాటు మూడవ తేదిన ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ఫలితాల అనంతరమే లాక్డౌన్ విధిస్తారని మే అయిదు నుండి పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేసేందుకు మే రెండున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని కథనాలు వెలువడుతున్నాయి..ఇందుకోసం కేసీఆర్ కసరత్తు కూడ చేశారని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.