హోమ్ /వార్తలు /తెలంగాణ /

kishan reddy : కేంద్రానికి లాక్డౌన్ ఆలోచన లేదు. ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు కూడ లేవు..కేంద్రమంత్రి

kishan reddy : కేంద్రానికి లాక్డౌన్ ఆలోచన లేదు. ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు కూడ లేవు..కేంద్రమంత్రి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

kishan reddy :కేంద్రానికి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్సష్టం చేశారు. పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలే లాక్డౌన్ విధించుకునే అధికారం ఉందని ఆయన తెలిపారు.

లాక్డౌన్ పై నిర్ణయం తీసుకునే ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారులదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్సష్టం చేశారు. అంతేగాని కేంద్రం లాక్డౌన్ పెట్టే యోచన లేదని చెప్పారు. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పత్రికల్లో వస్తున్నట్టు అధ్వాన్న పరిస్థితులు ఏం లేవని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తోపాటు, రెమిడెవిసర్, వెంటిలేటర్ల‌లతో పాటు ఇతర వసతులు పూర్గిగా ఉన్నాయని చెప్పారు. అయితే ఆసుపత్రుల్లో పేషంట్లను దృష్టిలో పెట్టుకుని బెడ్లను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆక్సిజన్ సమస్యలు తీరుతాయని చెప్పారు. వ్యాక్సిన్ల తయారి కోసం కూడ సుమారు 300 కంపనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఇక దేశంలో కేవలం 10 రాష్ట్రాల్లోనే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని , అందుకే ఆయా రాష్ట్రాలకే లాక్డౌన్ అధికారం ఉందని ఉన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందుతోంది

ముఖ్యంగా తెలంగాణలో ప్రచారం జరుగుతున్నట్టుగా కొవిడ్ పేషంట్లు తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రితో పాటు నగరలోని పలు ఆసుపత్రులను ఆయన స్వయంగా సందర్శించారు. ఈ సంధర్భంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు ,రోగుల పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులంటూ కథనాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే..దీంతో పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తోపాటు ఇతర సౌకర్యాలు లేవని కొన్ని మీడీయా సంస్థల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలిలోని టీమ్స్ లో అధ్యాన్న పరిస్థితులు ఉన్నాయని, అది మరో గాంధీలాగా మారుతుందని ఓ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని కథనం వెలువడింది. దీంతో నగరంలో ఆసుపత్రులపై ఇదే కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్యయంగా రంగంలోకి దిగారు.

tims ను సందర్శించిన కిషన్ రెడ్డి

నగరంలోని గాంధీతో పాటు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రులను కిషన్ రెడ్డి సందర్శించారు. అక్కడి పరిస్థితులను ఆయన డాక్టర్లతో పాటు కరోనా పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అంశాలను వెల్లడించారు. మొత్తం టిమ్స్ లో 600 మంది కరోనా పాజీటివ్ రోగులు చికిత్స పోందుతున్నారని, అందులో వందమంది ఐసియులో , మరో యాబై మంది సాధరణ చికిత్స పోందుతున్నారని వివరించారు. కాగా టిమ్స్ కు ప్రత్యేకంగా 200 వెంటిలేటర్లను కేంద్రం సమకూర్చిందని చెప్పారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Kishan Reddy, Lockdown, Telangana

ఉత్తమ కథలు