హోమ్ /వార్తలు /తెలంగాణ /

corona కష్టాలు : డబ్బు కట్టు.. బయటకు పో.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై ఆవేదన

corona కష్టాలు : డబ్బు కట్టు.. బయటకు పో.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై ఆవేదన

కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు(ఫైల్ ఫోటో)

కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు(ఫైల్ ఫోటో)

corona treatment : కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి జడలు విప్పారు. ఇన్స్యూరెన్స్ పేరుతో ఆసుపత్రుల్లో చేర్చుకుని చివరకు మొండి చేయి చూపిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే చికిత్స చేస్తామంటూ హుకుంలు జారీ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...


కరోనాతో రోగులు సతమతవుంటే మరోవైపు ఆసుపత్రుల యజమానుల దోపిడికి తెరలేపారు..కార్పోరేస్ ఆసుపత్రుల నుండి చిన్న స్థాయి ఆసుపత్రులకు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లక్షల రూపాయలు లేనిదే కరోనా రోగులకు చికిత్స అందించే పరిస్థితి కనిపించడం లేదు..ఓ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లభ్యమవుతున్నాయని చెబుతున్నా కొంతమంది పాజిటివ్ సోకిన వారు మాత్రం ప్రాణాల మీద బీతితో ప్రైవేటు ఆసుత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆసుపత్రుల యజమాన్యం కాస్లీ చికిత్సకు తెరలేపి అందినంతవరకు దండుకుంటున్నారు.. అనంతరం డబ్బులు ఇవ్వందే చికిత్స లేదంటూ హుకుం జారీ చేస్తున్నారు..దీంతో పాజిటీవ్ సోకిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రి నిర్వాకం పై భాదితుడు వీడియో ద్వార సందేశాన్ని పంపారు. ఆల్వాల్‌కు చెందిన రామారావు అనే వ్యక్తి డబ్బులకు ఎలా ఇబ్బందిపెడుతున్నారో వీడియో ద్వార వివరించారు. రామారావు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. దీంతో ఇన్స్యూరెన్స్ చెల్లుతుందంటూ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఇలా నాలుగు రోజుల తర్వాత ఇన్స్యూరెన్స్ చెల్లడం లేదంటూ.. డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఇన్స్యూరెన్స్ కంపనీని సంప్రదిస్తే మాత్రం ఆసుపత్రి నిర్వాకం వల్లే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కాలేదని భాదితుడికి వివరించినట్టు చెప్పారు.

కాగా రామారావు ఏప్రిల్ ఒకటి నుండి ఆసుపత్రిలో ఉంటుండగా గత నాలుగు రోజుల నుండి ఎలాంటీ చికిత్స అందించడం లేదని, చివరకు ఎలాంటీ సౌకర్యాలు లేని రూంలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆసుపత్రి నిర్వాకం మంత్రి కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన కుటుంభసభ్యులు చెప్పారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Corona cases, Hyderabad, Private hospitals

ఉత్తమ కథలు