హోమ్ /వార్తలు /తెలంగాణ /

No Lock down, curfew: లాక్ డౌన్ , కర్ఫ్యూ ఆలోచన లేదు.. ఒకవేళ పెడితే కరోనా కంటే ఎక్కువ మరణాలు ఆకలితో ఉంటాయి: ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు

No Lock down, curfew: లాక్ డౌన్ , కర్ఫ్యూ ఆలోచన లేదు.. ఒకవేళ పెడితే కరోనా కంటే ఎక్కువ మరణాలు ఆకలితో ఉంటాయి: ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు

మధ్య ప్రదేశ్‌ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్‌ సీక్వేన్సింగ్‌ కోసం నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ డిసిజ్‌ కంట్రోల్‌కు పంపించారు. దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్‌సీడీసీ తెలిపింది.

మధ్య ప్రదేశ్‌ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్‌ సీక్వేన్సింగ్‌ కోసం నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ డిసిజ్‌ కంట్రోల్‌కు పంపించారు. దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్‌సీడీసీ తెలిపింది.

No Lock down, curfew: తెలంగాణలో కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు పడకలు, ఆక్సిజన్ కొరత లేదది.. ఏమైనా అనుమానాలు ఉంటే 104 కి కాల్ చేయవచ్చని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్- నైట్ కర్ఫ్యూ- వీకెండ్ కర్ఫ్యూ అవసరం లేదని.. లాక్ డౌన్ పెడితే కరోనా సోకి చనిపోయే రోగులకంటే ఆకలితో చనిపోయే వారు ఎక్కువగా ఉంటారని అన్నారు. అందుకే అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో 116 ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కొన‌సాగుతుందని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు అ‌న్నారు. తెలంగాణలో ఎక్క‌డా బెడ్ల కొర‌త లేద‌ని, కేవ‌లం 15-20 కార్పొరేట్ ఆస్ప‌త్రుల్లోనే ప‌డ‌క‌ల కొర‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు. 80 శాతం మంది క‌రోనా బాధితుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు అని వెల్లడించారు. ప్రతీ రోజు ల‌క్ష‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామని.. కేవ‌లం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యింద‌న్నారు. కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో వచ్చే నాలుగు నుంచి ఆరు వారాలపాటు ప్రతీ ఒక్కరూ సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ దీనికి సహకరించాలని.. లేదంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందన్నారు. ఇప్పడు కరోనా వ్యాప్తి కంటే వచ్చే నాలుగు వారాల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందన్నారు. అందకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని.. ప్రైవేటు వెళ్లి మోసపోకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, రెమిడీస్విర్ సహా అన్ని మందులు. ఉన్నాయని వాటికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.

  ఎలాంటి కర్ఫ్యూలు ఉండవు..

  ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్- నైట్ కర్ఫ్యూ- వీకెండ్ కర్ఫ్యూ అవసరం లేదని.. లాక్ డైన్ పెడితే కరోనా సోకి చనిపోయే రోగులకంటే ఆకలితో చనిపోయే వారు ఎక్కువగా ఉంటారని అన్నారు. అందుకే అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. మ‌హారాష్ట్ర నుంచి ఓ ఉత్స‌వం నిమిత్తం స‌రిహ‌ద్దు జిల్లాకు మార్చి 24న‌ 20 మంది వ‌చ్చారు. అక్క‌డ జ‌రిగిన ఆ ఉత్స‌వంలో స‌రిహ‌ద్దు జిల్లాకు చెందిన మ‌రో 30 మంది పాల్గొన్నారు. వారిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించ‌గా మ‌రో 34 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. అలా 34 మంది 433 మందికి క‌రోనా వ్యాపించిందన్నారు.

  చిన్నచిన్న మైనర్ సమస్యలకు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదని.. పెద్ద పెద్ద క్రిటికల్ కేసులకు మాత్రమే పెద్దాసుపత్రుల అవసరం పడుతుందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తమను తన ఇంట్లో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Corona, Corona cases, Hyderabad, Lock down, Telangana, Telangana health director

  ఉత్తమ కథలు