హోమ్ /వార్తలు /తెలంగాణ /

Preethi passed away: మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత

Preethi passed away: మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత

preethi no more

preethi no more

Preethi passed away:మెడికల్ స్టూడెంట్ ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. నాలుగు రోజులుగా ట్రీట్‌మెంట్ పొందుతున్న ప్రీతి కన్నుమూసినట్లుగా నిమ్స్ వైద్యులు ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెడికల్ స్టూడెంట్ ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. వరంగల్ కాకతీయ మెజికల్ కాలేజీలో పీజీ చేస్తున్న ప్రీతి ఈనెల 18వ తేదిన సీనియర్ మహ్మద్ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మరుసటి రోజు ఆమెను హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రీతి అపస్మారకస్థితిలో ఉన్న ప్రీతికి వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. గత నాలుగు, ఐదు రోజులుగా నిమ్స్‌ వైద్యులు ఆమెను బ్రతికించేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయింది. రాత్రి 9.గంటల 10నిమిషాల సమయంలో తుది శ్వాస విడిచినట్లుగా నిమ్స్‌ వైద్యులు తెలిపారు. మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్‌గా చూస్తామనుకున్న బిడ్డ ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉండటం చూసి ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రీతి కన్నుమూత..

వరంగల్ కేఎంసీలో పోస్ట్‌గ్రాడ్యూయేషన్‌(ఎండీ)చదువుతున్నప్రీతి సీనియర్ మహ్మద్ సైఫ్‌ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గత ఐదు రోజులుగా చావుతో పోరాడి చివరకు ఓడిపోయింది. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. తండ్రి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రీతి మూడో కుమార్తె.

రోదిస్తున్న తల్లిదండ్రులు..

వరంగల్ కేఎంసీలో పోస్ట్‌గ్రాడ్యూయేషన్‌(ఎండీ)చదువుతున్న యువతిని సీనియర్‌ వేధిస్తుండగా కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోకపోవడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వేధింపులు మరింత పెరగడంతో భరించలేక మంగళవారం రాత్రి ప్రాణాలు తీసుకునేందుకు విషపూరితమైన ఇంజెక్షన్‌ వేసుకుందనే ఆరోపణలు వచ్చాయి.

ఖండిస్తున్న డాక్టర్స్ అసోసియేషన్..

మెడికో ప్రీతి ఓవర్ డోస్ మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లుగా కొందరు తప్పుడు రాతలు రాయిస్తున్నారని..దీని వెనుక ఎవరో ఉండే ఇదంతా చేస్తున్నారని డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడురమేష్ అంటున్నారు. ప్రీతి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

కఠినంగా శిక్షించాలని డిమాండ్..

ప్రీతి మరణానికి  సీనియర్ సైఫ్  వేధింపులే కారణని బాధితురాలి తండ్రి నరేంద్ర, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడు సైఫ్‌ను తమకు అప్పగించాలని డిమాం చేస్తున్నారు.ఈవిషయంలో ఇది ముమ్మాటికి ప్రభుత నిర్లిప్తత, పోలీసు నిర్లక్ష్యం వల్లే జరిగిందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

First published:

Tags: Hyderabad, Telangana News

ఉత్తమ కథలు