హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Metro: మెట్రోపై కరోనా పడగ.. నష్టాల బాటలో నడుస్తున్న మెట్రోరైలు.. సగానికి తగ్గిన ప్రయాణికులు..

Hyderabad Metro: మెట్రోపై కరోనా పడగ.. నష్టాల బాటలో నడుస్తున్న మెట్రోరైలు.. సగానికి తగ్గిన ప్రయాణికులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై కరోనా, నైట్ కర్ఫ్యూ ప్రభావం విపరీతంగా పడింది. నష్టాల నుంచి లాభాల వైపు ప్రయాణం చేస్తున్న మెట్రోకు ఒక్కసారి మళ్లీ పట్టాలు తప్పినట్టైంది. కరోనా సెకండ్ వేవ్ తో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడడం లేదు. దీంతో నష్టాలను మూట కట్టుకుంది.

ఇంకా చదవండి ...

కరోనా నేపథ్యంలో అన్ని వ్యాపార సముదాయాలు దాదాపు నష్టాల్లో నడుస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తగ్గిస్తుండగా.. మరొకొన్ని మూత పడుతున్నాయి. గత సంవత్సర అనుభవాల దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటిస్తూ అకస్మాత్తుగా కాకుండా లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలపై ప్రభుత్వాలు ఆచీతూచీ అడుగులు వేస్తున్నాయి. అయితే రవాణా రంగం మాత్రం ఈ సారి బాగా నష్టపోయింది. కేసులు విపరీతంగా పెరగడంతో జనాలు బయటకు రావడం లేదు. విధులకు వెళ్లే వారు మాత్రం తమ సొంత వాహనాలను మాత్రమే వాడుతున్నారు. ప్రజా రవాణాను ఉపయోగించడానికి ముందుకు రావడం లేదు. అయితే మార్చి నెల వరకు మంచి లాభాల్లో నడిచిన హైదరాబాద్ మెట్రో ఏప్రిల్ నుంచి నష్టాలను చూస్తుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెడుతూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మెట్రో ప్రయాణాలను జనాలు ఇష్టపడటం లేదు. కరోనా ప్రభావం మైట్రో పై బాగా పడింది. ప్రయాణికులు చాలా మంది తగ్గిపోయారు. మార్చి నెల వరకు ప్రయాణికుల సంఖ్య 2లక్షలకు చేరువ కాగా ఇప్పుడు ఆ సంఖ్య సగానికి పైగా పడిపోయింది.

గత సంవత్సరం లాక్ డౌన్ విధించినప్పుడు పూర్తిగా రద్దు చేసిన మెట్రో మళ్లీ అన్ లాక్ తర్వాత నష్టాలలో నడిచింది. దాదాపు ఆరు నెలల వరకు నష్టాలను చూసిన మెట్రో మార్చి వరకు ఎంతో కొంత లాభాల బాటలో నడిచింది. మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో మెట్రోపై మరో పిడుగు పడిపోయింది. ఇప్పటికే 100 మంది కూర్చునే చోట సీటు విడిచి సీటు కూర్చోవడంతో 50 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా పర్వాలేదని మెట్రో నడిపించినా మళ్లీ దీంతో కోలుకోలేని దెబ్బ పడింది. నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, ప్రతి ఐదుగురిలో ఒకరు కొవిడ్‌ బారిన పడుతుండటంతో ప్రజలు చాలావరకు ప్రయాణాలను తగ్గించుకున్నారు. తప్పనిసరి విధులకు హాజరు కావాల్సిన వారు, అత్యవసర పనుల మీద వెళ్తున్న వారు మాత్రమే ప్రజా రవాణాలో రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి పనులకు కూడా చాలామంది వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాధారణంగా వేసవిలో చాలామంది సొంత వాహనాలు వదిలేసి మెట్రోలో ప్రయాణిస్తుంటారు.

దీంతో మెట్రో రైల్‌కు వేసవిలో అధిక ఆదాయం సమకూరుతుంది. అయితే ఈసారి కరోనా కేసులు పెరగడంతో పరిస్థితి తలకిందులైంది. ప్రయాణికులు ఎవరూ లేకపోయినా గతంలో మాదిరిగానే మెట్రో లను నడిపిస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక మెట్రోను నడుపుతున్నారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని.. సురక్షితంగా ఉంచుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. మళ్లీ కరోనా వేవ్ తగ్గి ప్రజలు మాములు జీవన విధానానికి అలవాటు పడినప్పుడు మెట్రో లాభాల్లో నడిచే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Corona, Corona cases, Hyderabad, Hyderabad Metro rail, Lock down, Loss and profit, Metro loss, Night curfew in Telangana, Secunderabad

ఉత్తమ కథలు