Hyderabad Traffic Rules : సరికొత్త ట్రాఫిక్ రూల్స్‌తో వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌కి అసలు కారణం.. వాహనదారులు రూల్స్ సరిగా పాటించకపోవడమే అని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల ప్రజలు రూల్స్ కరెక్టుగా ఫాలో అయ్యేలా చేసేందుకు ఫైన్లు పెంచాలని నిర్ణయించారు. ఆ ప్రకారం.. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసిన వారికి రూ.1,700 ఫైన్ వేస్తారు. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా తప్పదు. ఇలా భారీ ఫైన్ విధించడం వల్ల ఇకపై ప్రజలు రాంగ్ రూట్లో వెళ్లరనీ, ట్రిపుల్ రైడింగ్ చెయ్యరని పోలీసులు భావిస్తున్నారు.
ప్రతి శనివారం, ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. ఈ దిశగా మరింత ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత పగడ్బంధీగా నిర్వహించనున్నట్లు తెలిసింది.
Weekly Horoscope : వారఫలాలు .. నవంబర్ 20 నుంచి 26 వరకు రాశి ఫలాలు
వారి వల్లే సమస్య :
ప్రధానంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రూల్స్ పాటించని వారి వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అలాగే.. వారి వల్ల రూల్స్ పాటించేవారు ఇబ్బంది పడుతున్నారు. రూల్స్ అతిక్రమించేవారు.. ట్రాఫిక్‌లో త్వరగా వెళ్లిపోగలుగుతుంటే.. రూల్స్ పాటించేవారికి ఆలస్యం అవుతోంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి.. రూల్స్ పాటించే వాహనదారులకు మేలు జరిగేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆంక్షలను పాటించని వారిపై భారీ ఫైన్లతోపాటూ.. చట్టపరంగా ఏమేం చెయ్యాలో అన్నీ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.