Home /News /telangana /

HYDERABAD NEWS 18 TELUGU GOT IMA COVID WARRIORS AWARDS IN HYDERABAD FULL DETAILS HERE PRN BK

IMA Awards: కొవిడ్ వారియర్స్ IMA అవార్డులు.. కిషన్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం..

బ్రిటీష్ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ నుంచి అవార్డు అందుకుంటున్న న్యూస్18తెలుగు  అసోసియేట్ ఎడిటర్ పీవీ రమణ కుమార్

బ్రిటీష్ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ నుంచి అవార్డు అందుకుంటున్న న్యూస్18తెలుగు అసోసియేట్ ఎడిటర్ పీవీ రమణ కుమార్

కరోనా మహమ్మారి (Corona Virus) మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ తో పోరాడటంలో అన్ని రంగాలు విశేషంగా కృషి చేశాయి. ముఖ్యంగా వైద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. ఇదే సమయంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడంలో మీడియా కూడా ప్రముఖ పాత్ర పోషించింది.

ఇంకా చదవండి ...
  ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) బంజారాహిల్స్ బ్రాంచ్ వ్యవస్థాపక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్ బ్రాంచ్ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ మాచినేని సంపత్ రావు ప్రమాణం చేయించారు. అనంతరం ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయలాల్ ప్రభుకుమార్ కు లాంచనంగా ఐఎంఏ మెడల్ వేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కోవిడ్ సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా విధులు నిర్వహించిన మీడియా ప్రతినిధులు, పోలీసు అధికారులు, డాక్టర్లకు అవార్డులు అందజేసి సత్కరించారు.

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కరోనా కష్టకాలం ఎన్నో పాఠాలు నేర్పించదని అన్నారు. ప్రాణాలకు తెగించి వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని కొనియాడారు. “కోవిడ్ తో భార్య చనిపోతే భర్త రాలేదు.. భర్త చనిపోతే భార్య రాలేదు. డాక్టర్లయిన కుటుంబ సభ్యలను ఇళ్లలోకి కూడా రానీయలేదు. అయినా... వైద్యలు, మీడియా ప్రతినిధులు తమ పోరాటాన్ని ఆపలేదు.” అని అన్నారు.

  Covid-19, Covid Warriors awards, News18Telugu, Hyderabad News, Banjara Hills, Indian Medical Association, Covid News, Corona News, Telugu Medai, Telangana News, Hyderabad News Today, కొవిడ్-19, కరోనా వైరస్, కొవిడ్ వారియర్స్ అవార్డులు, న్యూస్18తెలుగు, హైదరాబాద్ వార్తలు, బంజారాహిల్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ వార్తలు
  IMA అవార్డుల కార్యక్రమంలో కిషన్ రెడ్డి

  ఇది చదవండి: ఏపీలో పీఎంఏవై ఇళ్లపై బీజేపీ చెప్పేలెక్కలు సరైనవేనా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..!


  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రిటీష్ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ భారత్-బ్రిటన్ దేశాల మధ్య గత వైద్య పరమైన సంబంధాలను గుర్తు చేశారు. ఇరు దేశారు వైద్య అంశాల్లో సహకరించుకోవాలని ఆంకాంక్షించారు. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు జయలాల్ వైద్యుల నేవానిరతిని కొనియాడారు. ఒకప్పుడు 40 ఏళ్లుగా ఉన్న మనిషి సగటు జీవన కాలం ఇప్పుడు 70 ఏళ్లకు పెగిందని... దీనికి డాక్టర్లు, వారి అందిపుచ్చుకున్న సాంకేతికతే కారణమని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ తరహాలోనే ఇండియన్ మెడికల్ సర్వీసెస్ ను కూపకల్పన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ వైద్య శాఖ కార్యదర్శి బాధ్యతలు డాక్టర్లే నిర్వర్తించే వారని.. దాన్ని పునరుద్దరించాలని జయలాల్ అన్నారు.

  ఇది చదవండి: ఒమిక్రాన్ టెన్షన్ పెడుతున్నా.. తగ్గుతున్న కేసులు.. ఏపీలో తాజా అప్ డేట్ ఇదే..


  నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ప్రభుకుమార్ వైద్యులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. దాడుల నిరోధానికి అవసరమైన చట్టాలున్నా... చట్టాలు కఠినంగా అమలయ్యేల ప్రభుత్వాలు చొరవ చూపాయలని కోరారు. డాక్టర్లపై దాడులు జరిగిన ఐదు నిమిషాల్లో చర్యలు తీసుకునేలా చొరవ చూపితే వైద్యులు తమ వృత్తిని మరింత విశ్వాసంతో నిర్వర్తిస్తారని ప్రభుకుమార్ అన్నారు.

  అవార్ఢు గ్రహీతలు వీరే...
  బెస్ట్ డిబేట్ కేటగిరి లో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, కరోనా రీసర్చ్ ప్రొడ్యూసర్ గా కొండవీటి శివనాగరాజు, కరోన వారియర్ గా ఎలెందర్ రెడ్డి లకు ఐఎంఏ అవార్డులతో సత్కరించింది. అలానే టీవీ-5 మూర్తికి బెస్ట్ ప్రైమ్ టైమ్ షో, పివి రమణ కుమార్, అసోసియేట్ ఎడిటర్ న్యూస్ 18 నెట్ వర్క్ బెస్ట్ కొవిడ్ యాంకర్ గా, సిద్దం మాధవి టీవీ5, బెస్ట్ హెల్త్ అవేర్ నెస్ గా అవార్డులను ప్రదానం చేశారు.

  డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అవార్డు..బి. శ్రీనివాసరెడ్డి, డిసీపీ, జనగాంకు ఇవ్వగా...కొవిడ్ వారియర్స్ అవార్డులను 1. బి. నరేందర్, టీవీ5, 2. కే రాజేష్, ఛీప్ కోఆర్డినేటర్, ఐన్యూస్, 3. కొన్నోజు రాజు, ఎన్టీవీ 4. కే. విక్రమ్ రెడ్డి, సాక్షిటీవీ, 5. ఏ ప్రవీణ్, ఏబీఎన్, 6. వి. లక్ష్మీ, వీ6, 7. టి. వంశీ కృష్ణ, టీన్యూస్, 8. ఆర్ ఏలేందర్ రెడ్డి, టీవీ9, 8. స్వీటీరెడ్డి, హెచ్ ఎంటీవీ. 9. పి. రాధిక, 10టీవీ, 10. కనిజ గారారి, బెస్ట్ కొవిడ్ రైటర్, 11. ఎస్. ధనుంజయ, కెమెరామెన్ 10టీవీ, 12. అమృత దిద్యాల, టైమ్స్ ఆఫ్ ఇండియా, 13. శేఖర్, ది హిందూ, 14.ఎం బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18 కి ప్రదానం చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Hyderabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు